హీరోయిన్ పేరుపై పాట.. ఏం చేస్తుందో..

హీరోయిన్ పేరుపై పాట.. ఏం చేస్తుందో..

నితిన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఛల్ మోహనరంగ. ఏప్రిల్ 5న విడుదల కానున్న ఈ చిత్రం.. ఇప్పుడు అన్ని హంగులను పూర్తి చేసుకుంది. రీసెంట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ మాంచి సక్సెస్ కావడంతో నితిన్ లో ఉత్సాహం రెండింతలు అయింది. ఛల్ మోహనరంగ మూవీకి మార్కెట్ లో కూడా మంచి బజ్ నెలకొంది. పవన్ కళ్యాణ్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ లు నిర్మాతలుగా వ్యవహరిస్తుండడం.. పబ్లిసిటీ విషయంలో బాగా కలిసొస్తోంది. అందుకే ఈ బజ్ ను రిలీజ్ వరకూ కొనసాగించేందుకు తగిన అన్ని ప్లాన్స్ ను పక్కాగా అమలు చేస్తోంది యూనిట్.

ఛల్ మోహనరంగ మూవీ సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో 'ఘ ఘ మేఘ' అంటూ సాగే పాట విషయంలోనే ఇండస్ట్రీ జనాల మాటలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. నిజానికి ఈ పాట ఛార్ట్ బస్టర్ గా నిలిచినా.. మేఘా ఆకాష్ గత చిత్రం లై సూపర్ ఫ్లాప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. నితిన్ కు బ్రేక్ వేసిన ఈ భామ.. మళ్లీ అదే హీరోతో వరుస మూవీ చేయడం విచిత్రమే. ఇప్పుడు ఘఘ మేఘా అంటూ సాగే పాటకు మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది యూనిట్. హీరోయిన్ పేరుపై సాగే ఈ పాట సినిమాలో అత్యంత కీలకం అంటున్నాడు దర్శకుడు కృష్ణచైతన్య.

కృష్ణకాంత్ రాసిన ఈ సాంగ్ చాలా సింపుల్ పదాలతో సాగడమే కాదు.. ఎవరైనా సరే హమ్ చేసేంత సులభంగా ఉంటుందని మూవీ యూనిట్ చెబుతోంది. పాటను పిక్చరైజ్ చేసిన లొకేషన్స్ అయితే బాగానే ఉన్నాయి. ఛల్ మోహనరంగ హైలైట్స్ లో ఒకటిగా నిలవడం ఖాయమని అంటున్నా.. హిట్టు లేని హీరోయిన్ పాత్ర పేరుతో సాగే ఈ పాట సినిమాకు ఏ మాత్రం కలిసొస్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు