కళ్యాణ్ రామ్.. అప్పుడే ఆ మాట అనేశాడే

కళ్యాణ్ రామ్.. అప్పుడే ఆ మాట అనేశాడే

నందమూరి కళ్యాణ్ రామ్ పుష్కర కాలం నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు. ఇన్నేళ్లలో అతడికి దక్కిన నిఖార్సయిన విజయాలు.. ‘అతనొక్కడే’, ‘పటాస్’ మాత్రమే. ఆ రెండూ కూడా అతడి సొంత చిత్రాలే. తన బేనర్లో చేసిన ఇతర సినమాలన్నీ తేడా కొట్టేశాయి. బయటి బేనర్లలో చేసినవైతే ఒక్కటంటే ఒక్కటీ ఆడలేదు. తాను ఎక్కువగా సొంత బేనర్లోనే సినిమాలు చేసుకోవడానికి ఇది కూడా ఒక కారణమని.. వేరే నిర్మాతల్ని రిస్క్‌లో పెట్టడం ఇష్టం లేక తాను ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ బేనర్‌కే పరిమితం అయ్యేవాడినని కళ్యాణ్ రామ్ చెప్పాడు. ఐతే బయటి బేనర్లలో చేస్తే సినిమాలు ఆడవన్న తన సెంటిమెంటును ‘ఎమ్మెల్యే’ మార్చిందని.. తన ఆలోచన మార్చినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలని అన్నాడు కళ్యాణ్ రామ్.

ఐతే ‘ఎమ్మెల్యే’ ఆరంభం బాగానే ఉంది కానీ.. ఆ సినిమా ఏమీ సేఫ్ జోన్లోకి వచ్చేయలేదు. తొలి వారాంతంలో ఈ చిత్రం రూ.6 కోట్ల లోపే షేర్ వసూలు చేసింది. ఇది సేఫ్ జోన్లోకి రావాలంటే ఇంకా చాలా దూరం ప్రయాణించాలి. ఇప్పటికి వెనక్కి వచ్చిన పెట్టుబడి మూడో వంతే. కొన్ని ఏరియాల్లో మాత్రం బయ్యర్లు 50 శాతం వెనక్కి రాబట్టుకున్నారు. వీకెండ్ తర్వాత వసూళ్లు కొంచెం తగ్గాయి. రెండో వీకెండ్లో కూడా చెప్పుకోదగ్గ వసూళ్లు వస్తేనే బయ్యర్లు సేఫ్ అవుతారు.

ఐతే ఈ వారాంతంలో ‘రంగస్థలం’ లాంటి భారీ సినిమా థియేటర్లలోకి దిగుతోంది. దానికి పాజిటివ్ టాక్ వస్తే ‘ఎమ్మెల్యే’ పరిస్థితి కష్టమవుతుంది. చెప్పుకోదగ్గ  ఆప్షన్లు లేక ఇప్పుడు ‘ఎమ్మెల్యే’కు వసూళ్లు వస్తున్నాయి కానీ.. పోటీలో సరైన సినిమా ఉంటే కథ మరోలా ఉండేదే. ‘నీదీ నాదీ ఒకే కథ’కు మంచి టాక్ వచ్చినా అది ఎ సెంటర్లలో మాత్రమే బాగా ఆడుతోంది. ప్రస్తుతం మాస్‌కు ఛాయిస్ ‘ఎమ్మెల్యే’ ఒక్కటే. ఐతే ‘రంగస్థలం’ వస్తే ఆ వర్గం ప్రేక్షకులంతా అటు టర్న్ అయిపోతారు. కాబట్టి బయటి బేనర్లో తొలి హిట్ కొట్టేశానని అప్పుడే కళ్యాణ్ రామ్ సంబరపడిపోవాల్సిన పని లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు