అలాంటోడు ఐటెం సాంగులెలా తీస్తాడో?

అలాంటోడు ఐటెం సాంగులెలా తీస్తాడో?

రామ్ చరణ్ మూవీ రంగస్థలం మరో మూడు రోజుల్లో థియేటర్లలోకి వచ్చేస్తోంది. ఇప్పుడు ప్రమోషన్ హంగామా కూడా స్టార్ట్ అయిపోయింది. టీవీ ఛానల్స్ లో కూడా నటీనటులు ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నారు. స్వయంగా రామ్ చరణ్ కూడా రంగస్థలం ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. చెర్రీ చెప్పే సంగతులు కొత్తగానే కాదు.. ఆశ్చర్యకరంగా కూడా ఉంటున్నాయి.

సుకుమార్ ను అందరూ ఇంటెలిజెంట్ డైరెక్టర్ అంటారనే సంగతి తెలిసిందే. మరి అలాంటి దర్శకుడు ఐటెం సాంగ్స్ కూడా బాగా తీస్తాడు కదా అని యాంకర్ అడిగితే.. 'ఆయన పిక్చరైజ్ చేసిన కొన్ని షాట్లు కొంతమందికి అర్ధం కూడా కావు. అంత ఇంటలెక్చువల్ గా సీన్స్ రాసుకునే సుక్కు.. అదే స్థాయిలో నేల టికెట్ ఆడియన్స్ ను అలరించేలా కూడా తీస్తాడు. ఆయన సినిమాల్లో ఐటెం సాంగ్స్ అందుకే చాలా క్యాచీగా ఉంటాయి. రంగస్థలం మూవీలో జిగేల్ రాణి కూడా అలాంటిదే. కొత్త వర్డ్ మాత్రమే కాదు.. కొత్త ట్యూన్ కూడా. చాలా క్యాచీగా ఉంటుంది ఆకట్టుకుంటుంది' అన్నాడు రామ్ చరణ్.

జిగేలురాణి పాటలో పూజా హెగ్డే ఐటెం భామగా కనిపించగా.. దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ అందరినీ తెగ మెప్పించేసిన సంగతి తెలిసిందే. పక్కా విలేజ్ బ్యాక్ డ్రాప్ తో ఓ నాటు సినిమాకు వర్క్ చేయాలనే కోరిక చాలా కాలం ఉందని పలు మార్లు చెప్పాడట దేవిశ్రీ. రంగస్థలం అలాంటి సినిమానే కావడంతో.. ఎంతో జాగ్రత్తగానే కాదు.. చాలా వేగంగా డీఎస్పీ ట్యూన్స్ ఇచ్చాడని చెప్పాడు చెర్రీ.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English