మహేష్ కంటే బెస్ట్ దొరకడం కష్టం

మహేష్ కంటే బెస్ట్ దొరకడం కష్టం

టాలీవుడ్ లో అదృష్టం వెతుక్కునేందుక మరో బాలీవుడ్ బ్యూటీ వచ్చేస్తోంది. అందాల భామ కైరా అద్వానీని తెలుగు హీరోయిన్ చేస్తున్నాడు దర్శకుడు కొరటాల శివ. తమ స్టోరీకి అనుగుణంగా సుదీర్ఘంగా కాల్షీట్స్ ఇవ్వగల హీరోయిన్ ను వెతికి.. చివరకు భరత్ అనే నేను మూవీలో కైరాను కన్ఫాం చేయగా.. ఇప్పుడు రిలీజ్ డేట్ దగ్గర పడ్డంతో ఈమె బాగా ఎగ్జయిట్ అయిపోతోంది.

'మహేష్ బాబు హీరోగా కొరటాల శివ లాంటి దర్శకుడు రూపొందిస్తున్న సినిమాతో.. తెలుగులో అరంగేట్రం చేయడం కంటే.. పెద్ద లాంఛ్ ప్యాడ్ ఎప్పటికీ దొరకదు. ఇలాంటి టీంతో పని చేసే అదృష్టం రావడం నా అదృష్టం. వారంతా నా మీద ఎంతో నమ్మకం ఉంచారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు అన్నివిధాలుగా ప్రయత్నించాను' అని చెప్పిన కైరా అద్వానీ.. డిగ్రీ పూర్తయిన రోజుల్లోంచి గ్లామర్ ఇండస్ట్రీలోకి రావాలని భావించానని అంటోంది. అయితే.. ఇక్కడ గ్లామర్ ఒక్కటే మ్యాటర్ కాదని.. బోలెడంత హార్డ్ వర్క్ కూడా చేయాల్సి ఉంటుందని చెప్పింది కైరా అద్వానీ.

భరత్ అనే నేను చిత్రం షూటింగ్ సమయంలో ప్రతీ నిమిషం ఎంజాయ్ చేసినట్లు కైరా చెబుతోంది. పక్కా హైద్రాబాదీ అమ్మాయి పాత్రను పోషిస్తున్నానని.. ఈ క్యారెక్టర్ ప్రతీ మహిళకు కనెక్ట్ అవుతుందని చెప్పిన కైరా అద్వానీ.. షూటింగ్ కు చాలా రోజుల ముందే తన డైలాగ్ వెర్షన్ ను దర్శకుడు ఇవ్వడంతో.. బాగా ప్రాక్టీస్ చేశానని.. ఆ మాటలు చెబుతున్నపుడు తాను తెలుగమ్మాయి కాదనే అనుమానం కూడా తనకు రాలేదని చెప్పింది. అంతే కాదు.. మహేష్ అసలు స్టార్ హోదా ఫీల్ కాడని.. తనకు డైలాగ్స్ విషయంలో చాలా సార్లు హెల్ప్ చేశాడంటోంది ఈ బాలీవుడ్ భామ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు