ఆ 'కథ'కు కంక్లూజన్ ఏంటి జక్కన్నా?

ఆ 'కథ'కు కంక్లూజన్ ఏంటి జక్కన్నా?

బాహుబలి మొదటి భాగం చూసిన తర్వాత.. రెండో మూవీ బాహుబలి ది కంక్లూజన్ కోసం చాలానే వెయిట్ చేయించాడు దర్శకధీరుడు రాజమౌళి. ఎట్టకేలకు బాహుబలి కథకు కంక్లూజన్ ఏంటో తెలిసింది. కానీ ఇప్పుడు ఒక సినిమాపై రకరకాల కథలు వినిపించేస్తున్నారు. రామ్ చరణ్.. ఎన్టీఆర్ కాంబినేషన్ లో రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా వస్తుందనే విషయంపై ఇప్పటికే ప్రకటన వచ్చేసింది.

#RRR అంటూ హ్యాష్ ట్యాగ్ పై హంగామా కూడా మొదలైంది. ఈ సినిమా కథ ఏంటి అనే విషయమే ఇప్పుడు తేలడం లేదు. నిజానికి ఇప్పటికే ఈ చిత్ర కథ ఇదీ అంటూ బోలెడన్ని మాటలు వినిపించాయి. స్పోర్ట్స్ నేపథ్యంతో సాగే సినిమా.. అన్నాదమ్ముల మధ్య సవాల్.. చెర్రీ హీరో- ఎన్టీఆర్ విలన్.. బాక్సింగ్ థీమ్ తో సాగే మూవీ.. అబ్బో ఇలా వినిపించిన రూమర్ల లెక్క రాసుకుంటేనే ఓ పుస్తకం అయిపోతుంది. అయితే.. రాజమౌళి తనకు స్టోరీ చెప్పలేదు అంటూ రీసెంట్ గా చెప్పేశాడు రామ్ చరణ్. సుమారుగా ఎన్టీఆర్ పరిస్థితి కూడా ఇందుకు దగ్గరగానే ఉంటుంది.

ఒకవేళ తెలిసినా వారంతట వారు బయటపెట్టే అవకాశం లేదు. కానీ బాహుబలి2 లాంటి భారీ సక్సెస్ తర్వాత.. రాజమౌళి నుంచి చిన్న సినిమాను ఎక్స్ పెక్ట్ చేయడం కష్టం. కాకపోతే.. తాను ఇప్పటివరకూ టచ్ చేయని ఓ కొత్త థీమ్ ను పట్టుకున్నాడని.. దానిపైనే సినిమా తీయబోతున్నారనే టాక్ మాత్రం గట్టిగానే ఉంది. సైన్స్ ఫిక్షన్ సినిమా తీస్తున్నాడని కొందరు చెబుతుంటే.. మరికొందరు ఫ్యాంటసీ ఫిలిం అంటున్నారు.

రొటీన్ యాక్షన్ థ్రిల్లర్ అనే టాక్ వినిపిస్తుంటే.. బాహుబలి అంత టైం తీసుకోకుండా అలాంటి స్టోరీనే తీయబోతున్నాడని మరికొందరు చెబుతున్నారు. ఇంతకీ ఇందులో నిజం ఏదో తెలియదు కానీ.. జనాలకు మాత్రం ఆలోచించీ ఆలోచించీ జుట్టు ఊడిపోయి బట్టతల వచ్చేస్తోంది. కాస్త ఆ కథేంటో చెప్పేసి జనాలను కనికరించవచ్చు కదా జక్కన్నా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English