ఆ వీడియోలు నీకెందుకమ్మా హీరో?

ఆ వీడియోలు నీకెందుకమ్మా హీరో?

సినీ నటిని లైంగికంగా వేధింపులకు గురి చేయడం.. ఆమెను వివస్త్రను చేసి వీడియోలు తీయడం.. రేప్ అటెంప్ట్ కేసులకు సంబంధించి.. మలయాళ స్టార్ హీరో దిలీప్ కేసులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సుదీర్ఘ కాలం పోలీస్ కస్టడీలో ఉన్న ఈ హీరోకు కొంతకాలం క్రితం బెయిల్ కూడా దొరికింది.

ఈ కేసు విచారణలో భాగంగా తనపై ఆరోపణలకు కారణమైన వీడియోలను తనకు అందించాలంటూ జిల్లా కోర్టులో పిటిషన్ వేయగా.. హీరోతోపాటు లాయర్ కు ఆ వీడియోలను చూసేందుకు కోర్ట్ అనుమతించింది. అయితే.. ఆ వీడియోలను తనకు ఇవ్వాలన్న దిలీప్ అభ్యర్ధనను మాత్రం కోర్టు తోసిపుచ్చింది. ఇదే అంశంపై దిలీప్ కేరళ హైకోర్టులో కూడా పిటిషన్ వేశాడు. ఆ వీడియోలను మార్ఫింగ్ చేసి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. తన సందేహాలను నివృత్తి చేసుకునేందుకు గాను వీడియోలను ఇవ్వాలని పిటిషన్ వేశాడు దిలీప్.

కానీ కేరళ హై కోర్టు నుంచి కూడా ఈ విషయంలో దిలీప్ కు చుక్కెదురైంది. ఆ వీడియోలను చూసేందుకు అనుమతి ఇచ్చినపుడు.. తిరిగి వాటి కాపీలను కోరడంలో అర్ధమేంటని నిలదీసింది. ఆయా సాక్ష్యాల విషయంలో జిల్లా కోర్టు తీరును సమర్ధించింది కేరళ హైకోర్టు. ఈ కేసు విషయంలో నిందితుడి కంటే.. ఆ మహిళ గౌరవానికి భంగం కలగకుండా చూడడానికే అధిక ప్రాధాన్యత ఉందంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు