బాలకృష్ణతో చేస్తాడట, ఎన్టీఆర్‌ ఒప్పుకుంటాడా?

బాలకృష్ణతో చేస్తాడట, ఎన్టీఆర్‌ ఒప్పుకుంటాడా?

బాలకృష్ణ, హరికృష్ణ కుటుంబాల మధ్య వున్న విబేధాల గురించి అభిమానులకి కూడా తెలుసు. ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌ చిత్రాల వేడుకలకి బాలకృష్ణ రావడం మానేసి చాలా కాలమవుతోంది. ఈ వ్యవహారం ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌లని బాగా దగ్గర చేసింది. ప్రస్తుతం ఎన్టీఆర్‌కి సంబంధించిన చాలా విషయాలని కళ్యాణ్‌రామే చూసుకుంటున్నాడు.

అయితే బాలయ్య తమని ఎంత దూరం పెడుతున్నా కానీ కళ్యాణ్‌రామ్‌కి బాబాయ్‌ అంటే చాలా అభిమానం. ఈ విషయాన్ని అతను ఎన్నోసార్లు చాటుకున్నాడు, ఇంకా చాటుకుంటూనే వున్నాడు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్లో బాలకృష్ణతో సినిమా చేయాలనేది కళ్యాణ్‌రామ్‌ కల. ప్రస్తుతం తన దగ్గరున్న ఒక మల్టీస్టారర్‌ సబ్జెక్ట్‌కి బాలయ్యని సంప్రదించాలని చూస్తున్నాడు. మరి ఎంతో కాలంగా వీరి కుటుంబానికి దూరంగా వుంటోన్న బాలకృష్ణ ఈ చిత్రం చేయడానికి అంగీకరిస్తారా అనేది ఆసక్తికరం.

మరోవైపు బయటకి ఏమీ మాట్లాడకపోయినప్పటికీ తన తండ్రికి పార్టీలో జరిగిన అన్యాయం పట్ల ఎన్టీఆర్‌ ఆగ్రహంగా వున్నాడనే రూమర్‌ వుంది. కళ్యాణ్‌రామ్‌ అభిమానం కొద్దీ బాలయ్యతో సినిమా కోసం సంసిద్ధమవుతున్నా, తన సంస్థలా భావిస్తోన్న ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌లో బాలయ్య సినిమాకి ఎన్టీఆర్‌ ఒప్పుకుంటాడా? అయితే ఈ సినిమా మెటీరియలైజ్‌ అయి దూరమైన ఈ కుటుంబాలు మళ్లీ దగ్గరయి ఒకే వేదికపై అందరూ కలిసి కనిపించాలని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు