త్రివిక్రమ్‌ కాన్ఫిడెన్స్‌ ఈ రేంజ్‌లో దెబ్బ తిన్నదా?

త్రివిక్రమ్‌ కాన్ఫిడెన్స్‌ ఈ రేంజ్‌లో దెబ్బ తిన్నదా?

ఛల్‌ మోహన్‌ రంగ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి త్రివిక్రమ్‌ గైర్హాజరు కావడం సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌ అయింది. ఈ చిత్రానికి నిర్మాతల్లో ఒకరయిన త్రివిక్రమ్‌ దీనికి కథ కూడా అందించాడు. తనకి బాగా నచ్చిన రచయిత, దర్శకుడు కృష్ణచైతన్య కోసం త్రివిక్రమ్‌ సెట్‌ చేసిన ప్రాజెక్ట్‌ ఇది. పవన్‌కళ్యాణ్‌ నిర్మాణ భాగస్వామ్యం తీసుకోవడానికి కూడా త్రివిక్రమే కారణం. ఈ ప్రాజెక్ట్‌కి కర్త, కర్మ, క్రియ అయిన త్రివిక్రమ్‌ ఈ వేడుకలో పాల్గొనకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అజ్ఞాతవాసి పరాజయం తర్వాత తొలిసారిగా పబ్లిక్‌ని ఫేస్‌ చేయడానికి వచ్చే త్రివిక్రమ్‌ ఏమి మాట్లాడతాడని ఆసక్తిగా ఎదరు చూసిన వారికి నిరాశ ఎదురైంది. ప్రస్తుతానికి షూటింగ్‌ కూడా లేకపోయినా కానీ త్రివిక్రమ్‌ ఈ వేడుకకి ఎందుకు రాలేదు? నితిన్‌, సుధాకర్‌రెడ్డికి ఖచ్చితంగా వస్తానని చెప్పి మరీ, పవన్‌కళ్యాణ్‌కి కూడా వస్తున్నట్టు ఇన్‌ఫర్మేషన్‌ ఇచ్చి మరీ త్రివిక్రమ్‌ రాలేదని తెలిసింది. ఈ వేడుకకి పవన్‌ ఫాన్స్‌ పెద్ద సంఖ్యలో వస్తారనేది త్రివిక్రమ్‌కి తెలుసు.

అజ్ఞాతవాసి ఆడియో వేడుకలో ఈ చిత్రంలో పవన్‌ నట విశ్వరూపం చూస్తారంటూ త్రివిక్రమ్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్లు ఫాన్స్‌కి ఇంకా గుర్తున్నాయి. త్రివిక్రమ్‌ ఈ వేడుకకి వచ్చినట్టయితే పవన్‌ గురించి ప్రస్తావించాల్సి వచ్చేది. దానికి అభిమానుల రియాక్షన్‌ ఎలా వుంటుందోనని, ఎన్టీఆర్‌ సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌తో బిజీగా వున్న టైమ్‌లో మానిపోయిన అజ్ఞాతవాసి గాయాన్ని రేపేలా ఈ వేడుకలో పాల్గొనడం దేనికని త్రివిక్రమ్‌ దీనిని స్కిప్‌ చేసాడట. అయితే వ్యక్తిత్వ వికాసం గురించి, ఆత్మ విశ్వాసం గురించి, జయాపజయాల గురించి అద్భుతంగా మాట్లాడే త్రివిక్రమ్‌ తన అపజయాన్ని ఫేస్‌ చేయలేనంతగా కాన్ఫిడెన్స్‌ని అజ్ఞాతవాసి దెబ్బతీసిందా అంటూ చర్చ జరుగుతోంది. చూస్తోంటే మళ్లీ ఎన్టీఆర్‌ సినిమా ఆడియో వేడుకలో తప్ప త్రివిక్రమ్‌ స్పీచ్‌ వినే అవకాశం లేనట్టుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు