దర్శకుడిగా మారబోతున్న హీరో

దర్శకుడిగా మారబోతున్న హీరో

సినీ పరిశ్రమలో కొందరేమో నటులవుదామనుకుని వచ్చి టెక్నీషియన్లుగా మారుతుంటారు. ఇంకొందరేమో టెక్నీషియన్లు అవ్వాలని ప్రయత్నించి నటులుగా మారుతుంటారు. అల్లరి నరేస్.. నాని.. సప్తగిరి.. ఇలా చాలామంది ముందు దర్శకులు కావాలన్న కలతోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆ విభాగంలో అనుభవం కూడా సంపదించారు. కానీ చివరికి వాళ్ల గమ్యం మారిపోయింది. నటులుగా స్థిరపడ్డారు.

ఐతే భవిష్యత్తులో వీరిని దర్శకులుగా కూడా చూస్తేమేమో చెప్పలేం. యువ కథానాయకుడు శ్రీవిష్ణు కుడా వీరి కోవకు చెందిన వాడే. అతను ముందు దర్శకుడవ్వాలన్న లక్ష్యంతోనే ఇండస్ట్రీకి వచ్చాడు. కొన్ని సినిమాలకు దర్శకత్వ విభాగంలోనూ పని చేశాడు. కానీ అనుకోకుండా నటుడయ్యాడు. మంచి పేరు సంపాదించాడు. ‘అప్పట్లో ఒకడేండేవాడు’.. ‘మెంటల్ మదిలో’.. తాజాగా ‘నీదీ నాదీ ఒకే కథ’ అతడికి నటుడిగా ప్రశంసలు తెచ్చిపెట్టాయి.

‘నీదీ నాదీ ఒకే కథ’ పాజిటివ్ టాక్‌తో మొదలై కమర్షియల్‌గానూ సక్సెస్ అయ్యే దిశగా సాగుతోంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ.. భవిష్యత్తులో తాను దర్శకుడిగా మారతానని శ్రీవిష్ణు వెల్లడించాడు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా తాను ఎంతో నేర్చుకున్నానని.. అ అనుభవాన్ని వృథా కానివ్వనని.. మంచి కథతో వైవిధ్యమైన సినిమా తీయాలుకుంటున్నానని శ్రీవిష్ణు తెలిపాడు.

ఐతే బలమైన కథ కుదిరి.. పక్కాగా స్క్రిప్టు తయారైనపుడే తాను దర్శకుడిగా మారతానని చెప్పాడు విష్ణు. మరి విష్ణుతో వరుసగా సినిమాలు నిర్మిస్తున్ అతడి మిత్రుడు నారా రోహితే దర్శకుడిగా అతడి తొలి సినిమాను కూడా ప్రొడ్యూస్ చేస్తాడేమో చూడాలి. ప్రస్తుతం ‘వీర భోగ వసంతరాయలు’ అనే మల్టీస్టారర్ మూవీ చేస్తున్న విష్ణు.. దీని తర్వాత ‘అసుర’ దర్శకుడితో ‘తిప్పరా మీసం’ అనే సినిమాలో నటించనున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు