పిక్ టాక్: అందాల జాక్ పాట్

పిక్ టాక్: అందాల జాక్ పాట్

అటు బుల్లితెరతో.. ఇటు వెండితెర పైనా మెరుపులు మెరిపిస్తున్న బ్యూటీ అనసూయ. అవకాశాలు ఎన్ని వస్తున్నా ఏరి ఎంపిక చేసుకుని మరీ తనకు నచ్చిన రోల్స్ లోనే కనిపిస్తున్న ఈ భామ.. ఇప్పుడు రంగస్థలం మూవీలో రంగమ్మత్తగా తెలుగు ప్రేక్షకులను అలరించబోతోంది.

మరోవైపు తెలుగు టెలివిజన్ పైనా తనదైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న అనసూయ.. సోషల్ మీడియాలో తెగ సెగలు పుట్టిస్తూ ఉంటుంది. జాక్ పాట్ అనే కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తున్న ఈ బ్యూటీ.. లేటెస్ట్ గా ఓ ఎపిసోడ్ షూటింగ్ కోసం అందాలను వెలిగించేసింది. తన స్కిన్ టోన్ కి దగ్గరగా అనిపించే టాప్ వేర్.. పింక్ బాటమ్ లో అమ్మడి షోకుల మెరుపులు మరీ పీక్ స్టేజ్ కి చేరిపోయాయి. ఈ హాట్ సమ్మర్ లో ఆ పింక్ ప్యాంట్స్ వేసుకున్నాక పంచుతున్న హాట్ నెస్ తనకు విపరీతంగా నచ్చేసిందని చెబుతోంది అనసూయ. ఈ భామ చెప్పిందని కాదు కానీ.. అనసూయ అందాలను ఈ పింక్ వేర్ మరింతగా పెంచేసిందనే విషయం ఒప్పుకుని తీరాల్సిందే.

సోషల్ మీడియాలో ఇలా హాట్నెస్ ను పంచడం అనసూయకు కొత్తేమీ కాదు. ఆయా కార్యక్రమాల్లో తను ధరించే గ్లామర్ వేర్ ను.. ఆయా ప్రోగ్రామ్స్ కి ప్రోమోల కంటే ముందే అమ్మడి ట్విట్టర్ హ్యాండిల్ లో ప్రత్యక్షమవుతుంటాయి. ఓ రకంగా ఇవి ఆయా ఎపిసోడ్స్ కి ఫస్ట్ లుక్ లాంటి వన్నమాట. అటు తనకు.. ఇటు ప్రోగ్రామ్ కి ప్రమోషన్ చేయడం కోసం అనసూయ ఐడియా అదుర్స్ కదూ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English