హాలీవుడ్ విలన్ గా రానా!!

హాలీవుడ్ విలన్ గా రానా!!

టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా ఇప్పటికే బాలీవుడ్ తో పాటు అనేక ఇతర ప్రాంతాల్లో కూడా భల్లాలదేవుడిగా ప్రతినాయక పాత్రలకు గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఏకంగా ఓ హాలీవుడ్ నుంచి ఓ ఆఫర్ రానాకు అందింది. అయితే.. ఇది నటించే అవకాశం కాదు కానీ.. ఓ ప్రతిష్టాత్మక చిత్రంలో విలన్ పాత్రకు డబ్బింగ్ చెబుతున్నాడు రానా.

అవెంజర్స్- ఇన్ఫినిటీ వార్ చిత్రం ఏప్రిల్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాుంది. మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రంపై అంచనాలు చాలానే ఉండగా.. ఈ చిత్రాన్ని ఇండియాలో డిస్నీఇండియా విడుదల చేయబోతోంది. ఇందులో విలన్ రోల్ థనోస్ కు వాయిస్ ఇస్తున్నాడు దగ్గుబాటి రానా. తను చిన్నప్పటి నుంచి మార్వెల్ కామిక్స్.. మార్వెల్ నిర్మించిన సినిమాలు చూశానని.. ఇప్పుడు ఆ సంస్థకు పని చేసే ఛాన్స్.. అందులోను అవెంజర్స్ సిరీస్ కు వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉందంటున్నాడు రానా. టాలీవుడ్ లో గతంలో ఇలాంటి ట్రెండ్ అంతగా కనిపించేది కాదు.

కానీ ఇప్పుడు తమ స్వరాన్ని అరువు ఇవ్వడం పెరుగుతోంది. చిరంజీవి పలు ఇతర చిత్రాలకు తన స్వరం ఇస్తున్నారు. ప్రేమ్ రతన్ ధన్ పాయో మూవీకి రామ్ చరణ్ ఇలాగే సల్మాన్ ఖాన్ పాత్రకు డబ్బింగ్ చెప్పాడు. ఇప్పుడు దగ్గుబాటి రానా కూడా ఓ హాలీవుడ్ నటుడికి డబ్బింగ్ చెబుతున్నాడు. ఇలా లోకల్ గా ప్రముఖమైన వాయిస్ లతో ఆయా సినిమాలను చూడడం టాలీవుడ్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు