తేడాలు రాకుండా చిరంజీవి చూసుకుంటారు

తేడాలు రాకుండా చిరంజీవి చూసుకుంటారు

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ హీరోల కౌంట్ చాంతాడంత ఉంటుంది. పేర్ల సంగతి పక్కన పెడితే.. ప్రస్తుతం 8 మంది హీరోలు ఆ కుటుంబం నుంచి ఉన్నారు. టాప్ రేంజ్ స్టార్ హీరోల నుంచి.. చిన్న హీరోల వరకూ ప్రతీ రేంజ్ లోను ఓ మెగా హీరో ఉన్నాడు. అయితే.. వీరిలో కొంతమంది ఏడాదికి ఒక సినిమా చేస్తే.. మరికొందరు 2-3 ముగించేస్తుంటారు.

ఆ లెక్కన ఎలా చూసుకున్నా ఓ డజన్ సినిమాలు మెగా హీరోల నుంచే రిలీజ్ అవుతుంటాయి. ఇలాంటి పరిస్థితిలో విడుదల విషయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఇంటెలిజెంట్.. తొలిప్రేమ చిత్రాలను ఒకేరోజు విడుదల ప్రకటించడం.. తర్వాత ఒక రోజు గ్యాప్ లో రెండు సినిమాలు విడుదల కావడం.. ఫిబ్రవరిలో గమనించాం. చివరి నిమిషంలో మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగి.. ఈ మాత్రం ఒక్క రోజు గ్యాప్ అయినా వచ్చేలా చేశారు. అయితే ఇప్పటివరకూ అలాంటివి రాకుండా ఉన్నాయని మనకు తెలుసు. కానీ వచ్చినా ముందే చిరంజీవి పరిష్కరింశారని అంటున్నాడు చెర్రీ.

'రిలీజ్ ల విషయంలో క్లాష్ రాకుండా నాన్న చర్యలు తీసుకుంటారు. అందుకే మేం ఎంతమంది ఉన్నా వర్క్ పైనే ఫోకస్ చేస్తాం. మా కజిన్స్ అందరూ వైవిధ్యంగానే ఉంటాం. అలాంటి కథలే ఎంచుకుంటాం.. సో మాలో మాకు పోటీ లేదు. నాన్న.. అలాగే అరవింద్ గారు మేమందరం కలివిడిగానే ఉండేలా చాలానే జాగ్రత్తలు తీసుకుంటారు' అన్నాడు రామ్ చరణ్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు