మెగా విక్టరీ మల్టీస్టారర్ అనౌన్స్ చేశారహో..

మెగా విక్టరీ మల్టీస్టారర్ అనౌన్స్ చేశారహో..

కొన్నాళ్లుగా ప్రచారం ఉన్న వార్తే నిజమైంది. సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్.. యువ కథానాయకుడు వరుణ్ తేజ్ కలిసి ఒక మల్టీస్టారర్ మూవీ చేయబోతున్నారు. ‘పటాస్’.. ‘సుప్రీమ్’.. ‘రాజా ది గ్రేట్’ సినిమాలతో హ్యాట్రిక్ హిట్లు కొట్టిన యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నాడు.

ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. అనుకున్నట్లే ఈ చిత్రానికి ‘ఎఫ్-2’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ అనేది క్యాప్షన్. అనిల్ తొలి సినిమాను తన బేనర్ మీద రిలీజ్ చేసి.. ఆ తర్వాతి రెండు సినిమాలను ప్రొడ్యూస్ చేసిన అగ్ర నిర్మాత దిల్ రాజే ఈ చిత్రాన్ని కూడా నిర్మించనున్నాడు.

ఐతే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లడానికి కొంచెం సమయం పడుతుంది. ప్రస్తుతం వెంకటేష్ తేజ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. వరుణ్ తేజ్ త్వరలోనే ‘ఘాజీ’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో సినిమా మొదలుపెట్టబోతున్నాడు. ఈ ప్రాజెక్టులు ఒక కొలిక్కి వచ్చాక అనిల్ సినిమా మొదలవుతుంది.

జులైతో షూటింగ్ ఆరంభమయ్యే అవకాశాలున్నాయి. ఈలోపు నటీనటులు.. టెక్నీషియన్ల ఎంపిక పూర్తి చేస్తారు. స్క్రిప్టు కూడా పక్కాగా రెడీ అవుతుంది. అనిల్ గత సినిమాల్లాగే ఇది కూడా ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ అంటున్నారు. ఈ చిత్ర హీరోలు.. దర్శక నిర్మాతలు.. అందరూ సక్సెస్ లో ఉన్న వాళ్లే. మరి ఈ సక్సెస్ ఫుల్ కాంబినేషన్లో ఎలాంటి సినిమా వస్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు