డైరెక్టర్ కాకముందు కష్టాలపై సుకుమార్..

డైరెక్టర్ కాకముందు కష్టాలపై సుకుమార్..

సినీ రంగంలో తామేంటో రుజువు చేసుకున్నాక వాళ్ల జీవితమే మారిపోతుంది. కానీ అలా నిరూపించుకోవడానికి ముందు పడే కష్టాలు అలా ఇలా ఉండవు. టాలీవుడ్లో ఇప్పుడు టాప్ లెవెల్లో ఉన్న చాలామంది దర్శకులు ఒకప్పుడు అష్టకష్టాలు పడ్డవాళ్లే. అందుకు తాను కూడా మినహాయింపు కాదని అంటున్నాడు సుకుమార్.

డిగ్రీ ఫెయిలై.. తర్వాత డిగ్రీ స్టూడెంట్స్‌కే ట్యూషన్లు చెప్పడం మొదలుపెట్టి.. ఆపై కాకినాడ ఆదిత్య కళాశాలో మ్యాథ్స్ లెక్చరర్‌గా పని చేయడం మొదలుపెట్టిన సుకుమార్‌కు ముందు నుంచి సినిమాలపై ఆసక్తి ఉండేదట. యవ్వన ప్రాయం నుంచే కథలు, కవిత్వం రాయడం అలవాటు ఉండటంతో సినీ పరిశ్రమలో అదృష్టాన్ని పరీక్షించుకోవాలన్న ఆశతో హైదరాబాద్ వచ్చినట్లు సుకుమార్ తెలిపాడు.

ఐతే ఇక్కడికి వచ్చాక కానీ ఈ పరిశ్రమలో కష్టమేంటో తనకు తెలియలేదని.. తాను దర్శకుడిగా మారడానికి పెద్దగా కష్టపడలేదని.. కానీ అసిస్టెంట్ డైరెక్టర్‌గా అవకాశం దక్కించుకోవడానికి.. కాస్త నిలదొక్కుకోవడానికి చాలా కష్టమైందని సుకుమార్ చెప్పాడు. రెండేళ్ల పాటు తిరిగినా అవకాశం రాకపోవడంతో వెనక్కి వెళ్లిపోయానని.. కానీ సినిమా పరిశ్రమలో ఏదో సాధిస్తానని వచ్చిన తాను తన వాళ్లకు ముఖం చూపించలేక తాను అంతకుముందు పని చేసిన కాకినాడ ఆదిత్య కళాశాలకు వెళ్లలేక అదే కళాశాలకు చెందిన భీమవరం బ్రాంచిలో చేరానని.. ఐతే సినిమాలపై మాత్రం వ్యామోహం చంపుకోలేక రెండోసారి మళ్లీ హైదరాబాద్ వచ్చి.. అసిస్టెంట్ డైరెక్టర్‌గా అవకాశం దక్కించుకుని ఇక్కడ నిలదొక్కుకున్నానని.. తర్వాత తొలి సినిమాను డైరెక్ట్ చేసే అవకాశం మాత్రం త్వరగానే వచ్చిందని సుకుమార్ వెల్లడించాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English