ఇద్దరు మిత్రులు.. ‘అజ్ఞాతవాసి’పై మాట్లాడతారా?

ఇద్దరు మిత్రులు.. ‘అజ్ఞాతవాసి’పై మాట్లాడతారా?

మూడు నెలల కిందట ‘అజ్ఞాతవాసి’ ఆడియో వేడుక ఎంత వైభవంగా జరిగిందో తెలిసిందే. అందులో త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రసంగం వింటే అతనో కళాఖండం తీశాడేమో అన్న భావనే కలిగింది. ఈ చిత్రంలో పని చేసిన వాళ్ల నుంచి.. మరికొందరు దిగ్గజాల నుంచి నుంచి తానేం నేర్చుకున్నానో చెబుతూ తనదైన శైలిలో ఒక అద్భుత ప్రసంగం చేశాడు త్రివిక్రమ్.

కెరీర్లో పతాక స్థాయి అందుకున్న సమయంలో తాను ఈ స్థాయికి చేరడానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నట్లుగా అనిపించింది ఆ ప్రసంగం చూస్తే. ఆ ప్రసంగం తర్వాత ‘అజ్ఞాతవాసి’పై అంచనాలు మరింత పెరిగాయి. కానీ తీరా చూస్తే ఆ సినిమా ఏమైందో తెలిసిందే.

కట్ చేస్తే ఈ మూడు నెలల్లో త్రివిక్రమ్ ఎక్కడా అడ్రస్ లేడు. అతను కానీ.. పవన్ కళ్యాణ్ కానీ ‘అజ్ఞాతవాసి’ గురించి ఒక్క ముక్క మాట్లాడింది లేదు. మునిగిపోతున్న సినిమాను ప్రమోట్ చేయడానికి కాస్తంత సాయం కూడా చేయలేదు ఆ ఇద్దరూ. ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత మళ్లీ ఆ ఇద్దరు మిత్రులు ఒకే వేదిక పంచుకోబోతున్నారు. తమ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిన ‘చల్ మోహన రంగ’ ప్రి రిలీజ్ ఈవెంట్లో పాల్గొనబోతున్నారు. మరి ఈ వేడుకలో వీళ్లిద్దరూ అసలేం మాట్లాడతారన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. ‘అజ్ఞాతవాసి’ ఆడి ఉంటే ఆ జోషే వేరుగా ఉండేది.

దాని గురించి పాజిటివ్‌గా మాట్లాడి ‘చల్ మోహన రంగ’ ముచ్చట్లలోకి వెళ్లి ఉండొచ్చు. కానీ అది తేడా కొట్టేసింది. అలాగని దాని గురించి పూర్తిగా అవాయిడ్ చేసి మాట్లాడినా ఇబ్బందే. ఈ నేపథ్యంలో ఇద్దరు మిత్రుల్లో ఎవరేం మాట్లాడతారో చూడాలి. పవన్ అయినా మామూలుగానే సినిమాల సంగతులు పెద్దగా మాట్లాడడు కాబట్టి ఓకే. కానీ ప్రధాన ఇబ్బంది త్రివిక్రమ్‌కే. అతనెలా మేనేజ్ చేస్తాడన్నదే ఆసక్తికరం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English