తప్పు జరిగింది.. దేవిశ్రీతోనే మళ్లీ

తప్పు జరిగింది.. దేవిశ్రీతోనే మళ్లీ

‘సింగం’ సిరీస్‌లో తొలి రెండు సినిమాలకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఎంత బలంగా నిలిచిందో తెలిసిందే. ఆ సినిమాలకు మంచి ఊపు తీసుకురావడంలో దేవిశ్రీ ప్రసాద్ పాత్ర కీలకం. మాస్‌ను ఉర్రూతలూగించే పాటలు.. నేపథ్య సంగీతంతో రెండు సినిమాలకు వెన్నుదన్నుగా నిలిచాడు దేవి. కానీ ఆశ్చర్యకరంగా ‘సింగం-3’కి అతడిని పక్కన పెట్టేశాడు దర్శకుడు హరి.

అతడి స్థానంలో హ్యారిస్ జైరాజ్‌ను మ్యూజిక్ డైరెక్టర్‌గా తీసుకున్నాడు. కానీ అతను ‘సింగం’ సినిమాలో ఉండే ఎనర్జీకి తగ్గ మ్యూజిక్ ఇవ్వలేకపోయాడు. ఆ సినిమా ఆడియో తేలిపోయింది. నేపథ్య సంగీతం కూడా తుస్సుమనిపించింది. సినిమా పరాజయానికి అదే కారణమని అనలేం కానీ.. దేవిశ్రీ లేని లోటు సినిమాలో స్పష్టంగా కనిపించిన మాట వాస్తవం.

ఐతే తన తర్వాతి సినిమాకు మళ్లీ దేవిశ్రీనే సంగీత దర్శకుడిగా తీసుకున్నాడు హరి. ఆ సినిమానే.. సామి-2. విశేషం ఏంటంటే.. దాదాపు దశాబ్దంన్నర కిందట వచ్చిన ‘సామి’కి హ్యారిస్ జైరాజ్ సంగీతం అందించాడు. ‘సింగం-3’కి దేవిని తప్పించి హ్యారిస్‌కు అవకాశమిచ్చిన హరి.. ఇప్పుడేమో ‘సామి-2’కు హ్యారిస్‌ను వద్దనుకుని దేవిని తీసుకున్నాడు.

విక్రమ్, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని రంజాన్‌ కానుకగా విడుదల చేయాలనుకుంటున్నారు. అప్పట్లో ‘సామి’ సెన్సేషనల్ హిట్టయింది. రజినీ సినిమా ‘పడయప్పా’ (నరసింహా) పేరిట ఉన్న కలెక్షన్ల రికార్డుల్ని కూడా బద్దలు కొట్టేసింది. మరి దీని సీక్వెల్ ఎలాంటి ఫలితాన్నందుకుంటుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English