పూరి రిక్వెస్ట్ చేస్తేనే దిల్ రాజు ఒప్పుకున్నాడా?

పూరి రిక్వెస్ట్ చేస్తేనే దిల్ రాజు ఒప్పుకున్నాడా?

ఈ రోజు ఒక ఆసక్తికర సమాచారం బయటికి వచ్చింది. తన కొడుకు పూరి ఆకాశ్‌ను హీరోగా పరిచయం చేస్తూ పూరి జగన్నాథ్ రూపొందిస్తున్న ‘మెహబూబా’ సినిమాను దిల్ రాజు రిలీజ్ చేయబోతున్నాడన్నది ఆ సమాచారం. ఇది చాలామంది ఆశ్చర్యం కలిగించింది. సినిమాల కొనుగోలులో రాజు చాలా క్యాల్కులేటెడ్‌గా ఉంటాడని పేరుంది.

అందులోనూ గత ఏడాది కాలంలో కొన్ని గట్టి ఎదురు దెబ్బలు తిన్న నేపథ్యంలో రాజు ఆచితూచి వ్యవహరిస్తున్నాడని అంటున్నారు. ఇలాంటి టైంలో వరుస ఫ్లాపుల్లో ఉన్న పూరి సినిమాను రాజు కొనడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఐతే ఈ ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ ప్రపోజల్ రాజు వైపు నుంచి వెళ్లింది కాదట. పూరి నుంచే ఈ ప్రతిపాదన వచ్చిందట.

గతంలో పూరి తీసిన ‘ఇడియట్’.. ‘పోకిరి’ సినిమాల్ని డిస్ట్రిబ్యూట్ చేసి భారీగా లాభాలందుకున్నాడు రాజు. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే రాజుకు తన కొడుకు సినిమాను రిలీజ్ చేసే ప్రతిపాదన చేశాడట పూరి. తన ట్రాక్ రికార్డు ఏమంత బాగా లేని నేపథ్యంలో ‘మెహబూబా’కు బజ్ రావడం కష్టమని.. బిజినెస్ చేసుకోవడమూ సమస్యే అని.. తన కొడుకుకిది అరంగేట్ర సినిమా కాబట్టి సాయం చేయాలని పూరి అడిగాడట రాజును. పెద్దగా లాభం ఏమీ ఆశించకుండా బడ్జెట్ రేటుకే సినిమాను ఇచ్చిసినట్లు సమాచారం. దిల్ రాజు సినిమాను కొన్నాడంటే అది కచ్చితంగా సినిమాకు పాజిటివ్ బజ్ తెస్తుంది.

పైగా రిలీజ్ విషయంలో ఇబ్బందులుండవు. పెద్ద ఎత్తున థియేటర్లు లభిస్తాయి. ఇవన్నీ చూసుకునే రాజును లైన్లోకి తెచ్చాడట పూరి. రాజు కూడా పూరి ఒకప్పుడు మంచి సినిమాలిచ్చిన నేపథ్యంలో ఈ ప్రపోజల్ అంగీకరించాడట. ఈ చిత్రం మేలో ప్రేక్షకుల ముందుకొస్తుందని అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు