ఎమ్మెల్యే బాగానే తెచ్చాడు కానీ..

 ఎమ్మెల్యే బాగానే తెచ్చాడు కానీ..

ఈ శుక్రవారం మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చింది నందమూరి కళ్యాణ్ రామ్ ‘ఎమ్మెల్యే’ సినిమా. ఈ చిత్రానికి టాక్ కొంచెం అటు ఇటుగా వచ్చింది. ఐతే ఆ ప్రభావం ఓపెనింగ్స్ మీద పెద్దగా పడలేదు. సమ్మర్ సీజన్లో వచ్చిన తొలి కమర్షియల్ సినిమా కావడంతో ఓపెనింగ్స్ అంచనాల్ని మించి వచ్చాయి.

కళ్యాణ్ రామ్ కెరీర్లోనే ఈ చిత్రానికి అత్యధిక ఓపెనింగ్స్ రావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు ఈ చిత్రం రూ.5.2 కోట్ల గ్రాస్.. రూ.3.3 కోట్ల షేర్ వసూలు చేసింది. ‘ఇజం’ తొలి రోజు వసూళ్లను ఈ చిత్రం అధిగమించింది. ఐతే రెండో రోజు ఈ చిత్రానికి వసూళ్లు ఎలా ఉంటాయన్నది కీలకం.

వీకెండ్ పూర్తయ్యే వరకు సినిమా నిలబడాలి. అప్పుడే బయ్యర్ల పరిస్థితి బాగుంటుంది. లేదంటే కష్టమవుతుంది. ‘ఎమ్మెల్యే’కు కళ్యాణ్ రామ్ కెరీర్లోనే అత్యధికంగా బిజినెస్ జరిగింది. కేవలం ఇండియా వరకే ఈ చిత్రం రూ.15 కోట్ల దాకా షేర్ రాబట్టాలి. రూ.13.5 కోట్ల మేర డొమెస్టిక్ థియేట్రికల్ బిజినెస్ చేసిందీ చిత్రం. ఖర్చులు కలిపితే రూ.15 కోట్లవుతుంది. ఇక అమెరికాలో ఈ చిత్రాన్ని తక్కువ మొత్తానికే అమ్మారు. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా రూ.18 కోట్ల దాకా షేర్ రాబట్టాల్సి ఉంది.

ఈ చిత్రానికి వచ్చిన టాక్ ప్రకారం చేస్తే అది పెద్ద టాస్కే. పోటీగా వచ్చిన ‘నీదీ నాదీ ఒకే కథ’కు మంచి టాక్ వచ్చినప్పటికీ అది కమర్షియల్ గా ఆడే అవకాశాలు తక్కువే. బి-సి సెంటర్ల ప్రేక్షకుల్ ‘ఎమ్మెల్యే’ బాగానే ఆకర్షించే అవకాశముంది కాబట్టి పెట్టుబడి రికవరీపై బయ్యర్లు ఆశతోనే ఉన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు