టీవీ యాంకర్‌కి పడిపోయిన సూపర్‌స్టార్‌

టీవీ యాంకర్‌కి పడిపోయిన సూపర్‌స్టార్‌

యాభై ఏళ్ల వయసుకి సమీపిస్తున్న సూపర్‌స్టార్‌ సల్మాన్‌ఖాన్‌ తన కెరీర్‌లోనే అత్యంత బెస్ట్‌ ఫేజ్‌ని ఇప్పుడు ఎంజాయ్‌ చేస్తున్నాడు. హీరోగా అతను ఇంతటి భారీ విజయాల్ని గతంలో ఎప్పుడూ ఇంత కన్సిస్టెంట్‌గా అందుకుని ఉండడు. స్టార్‌గా కావాల్సినవన్నీ ఉన్నా కానీ వ్యక్తిగతంగా ఇంకా జీవితంలో సెటిల్‌ కాకపోవడం సల్మాన్‌కి వెలితిని మిగిల్చింది.

ఎంతో మందిని ప్రేమించినా కానీ సల్మాన్‌తో జీవితాంతం ఉండే భాగస్వామి దొరకలేదు. ఇండియాలో ఎలాగో తనకి తగ్గ జోడీ లేదని భావించాడో ఏమో ఇప్పుడు సల్మాన్‌ ఓ విదేశీ యువతితో ప్రేమలో పడ్డాడు. లులియా వాంతుర్‌ అనే రొమానియన్‌ టీవీ యాంకర్‌తో సల్మాన్‌ చాలా క్లోజ్‌గా ఉంటున్నాడు.

సల్మాన్‌ ఈమెకి దగ్గరయ్యాడని ముందుగా ఫారిన్‌ మీడియానే గుర్తించింది. ఈమెని భాయ్‌ త్వరలోనే పెళ్లాడతాడని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. విదేశీ భామల్ని హిందీ తెరపై చూపించడం సాధారణ విషయమే కాబట్టి లులియాని తన తదుపరి చిత్రంలో పరిచయం చేస్తాడేమో మరి.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English