పవన్‌-గురూజీ... ఆ ఎక్సయిట్‌మెంట్‌ ఏది?

 పవన్‌-గురూజీ... ఆ ఎక్సయిట్‌మెంట్‌ ఏది?

ఒక కాంబినేషన్‌పై వున్న కొండంత క్రేజ్‌ని అధఃపాతాళానికి పడేసిన చిత్రం 'అజ్ఞాతవాసి'. పవన్‌, త్రివిక్రమ్‌ కలిస్తే మ్యాజిక్‌ అన్నట్టు ఉప్పొంగిపోయే అభిమానులు ఇప్పుడు అజ్ఞాతవాసి సినిమా ప్రస్తావన వచ్చినా కానీ తిట్ల దండకం అందుకుంటున్నారు. ఆడియన్స్‌ని టేకిట్‌ ఫర్‌ గ్రాంటెడ్‌గా తీసుకుని ఇష్టానికి తీసిన సినిమాతో ఈ ఇద్దరిపై వున్న క్రేజ్‌ బాగా తగ్గింది.

దీంతో వీళ్లిద్దరూ కలిసి 'ఛల్‌ మోహన్‌ రంగ' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి వస్తారన్నా కానీ సోషల్‌ మీడియాలో అసలు సందడే లేదు. వీళ్లు కలిసి వస్తున్నపుడు ఫీలయ్యే ఎక్సయిట్‌మెంట్‌ మొత్తం మిస్‌ అయింది. పవన్‌ జనసేన కార్యకలాపాలకి అభిమానుల మద్దతు పూర్తిగా వుంది కానీ అజ్ఞాతవాసి పరంగా గురి చేసిన నిరాశని మాత్రం వారు మర్చిపోలేకపోతున్నారు. పవన్‌కి సినిమాల నుంచి ఘనంగా వీడ్కోలు పలుకుతుందని ఆశించిన చిత్రం కాస్తా అతని కెరియర్‌లోనే అతి పెద్ద డిజాస్టర్‌గా మిగలడం ఫాన్స్‌ని తీవ్రంగా కలచి వేసింది.

నితిన్‌ చిత్రానికి వీరి రాకతో క్రేజ్‌ పెరుగుతుందని ఆ చిత్ర బృందం ఆశిస్తోంది. అయితే ప్రస్తుతం వాళ్లిద్దరూ కలిసి సినిమా చేస్తేనే ఫాన్స్‌ కూడా నమ్మకం పెట్టుకునేటట్టు లేరు. ఇక వారి రాకతో ఒక సినిమాకి క్రేజ్‌ ఏర్పడుతుందని ఆశించడం అత్యాశే అవుతుందేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు