బాలయ్య సినిమాలో ఆమెకి అంత సీనుంటుందా?

బాలయ్య సినిమాలో ఆమెకి అంత సీనుంటుందా?

బాలకృష్ణ తలపెట్టిన బృహత్తర ప్రాజెక్ట్‌ 'ఎన్టీఆర్‌' ఇంకా ప్రీ ప్రొడక్షన్‌ స్టేజ్‌లోనే వుంది. ఇంకా డైరెక్టర్‌ తేజ కాస్టింగ్‌ ఫైనలైజ్‌ చేయలేదు. ఎన్టీఆర్‌ పాత్రని బాలకృష్ణ పోషిస్తుండగా, ఆయన భార్య బసవతారకం పాత్ర ఎవరితో చేయించాలనే దానిపై చాలా చర్చ జరుగుతోంది. పలువురు నటీమణులు ఈ పాత్ర చేయడానికి నిరాకరించినట్టు సమాచారం.

బాలీవుడ్‌ సీనియర్‌ నటి విద్యాబాలన్‌ డేట్స్‌ కోసం తేజ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒకసారి ఆమె ఆసక్తి చూపించలేదని వార్తలొచ్చాయి. అయితే ఆ పాత్ర స్కెచ్‌లతో పాటు కథలో ఆమె భాగమెంత అనేది పూర్తిగా రెడీ చేసుకుని విద్యాబాలన్‌ని మరోసారి సంప్రదించబోతున్నారని సమాచారం. బాలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలు చేసే విద్యాబాలన్‌ కథలో తనకి ముఖ్య పాత్ర వుంటే తప్ప ఏ సినిమా అంగీకరించదు.

ఆచి తూచి సినిమాలు అంగీకరించే విద్యాబాలన్‌ని గతంలో చిరంజీవి సినిమాలో నటింపజేయాలనే ప్రయత్నం జరిగినా ఆమె ఒప్పుకోలేదు. ఎన్టీఆర్‌ బయోపిక్‌లో బసవతారకం పాత్ర అయితే చాలా లిమిటెడ్‌ అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎంతగా ఆ పాత్ర నిడివి పెంచినా కానీ విద్యాబాలన్‌ లాంటి నటి చేసేంతగా దానిని తీర్చిదిద్దగలరా అనేది చూడాలి. ఒకవేళ విద్య మరోసారి రిజెక్ట్‌ చేసినట్టయితే ఈ పాత్ర కోసం ఎవరిని సంప్రదిస్తారనేది కూడా ఆసక్తికరమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు