శ్రీరెడ్డికి అనసూయ వార్నింగ్?

శ్రీరెడ్డికి అనసూయ వార్నింగ్?

యాంకర్ కం యాక్ట్రెస్ గా అనసూయకు బోలెడంత క్రేజ్ ఉంది. తన పాపులారిటీని అంతకంతకూ పెంచుకుంటున్న ఈ బ్యూటీ.. డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ సినిమాల్లో రాణిస్తోంది. బుల్లితెర అయినా.. వెండితెర అయినా.. తన విలువను పెంచుకుంటున్న అనసూయ.. సోషల్ మీడియాలో మాత్రం ఫైర్ బ్రాండ్ మాదిరిగా ఉంటుంది.

రివీలింగ్ డ్రెస్సులతో తాను ఉన్న ఫోటోలను నెట్ లో షేర్ చేయడమే కాదు.. ఎవరైనా ఏమైనా తేడాగా కామెంట్ చేస్తే చెడామడా వాయించేయగలదు కూడా. రకరకాల సమస్యలపై కూడా రియాక్ట్ అయిపోతూ ఉంటుంది అనసూయ. కానీ ఇవన్నీ కేవలం ట్వీట్స్ వరకు మాత్రమే పరిమితం. కెమెరా ముందుకు వచ్చేసరికి నవ్వులు.. పకపకలు.. గ్లామర్.. క్యారెక్టర్లు.. యాంకరింగ్.. ఇవి తప్పితే.. కెమేరా వెనుక ఎక్కడా తనలోని ఫైర్ చూపించదు. కాని ప్రస్తుతం బాగా ట్రెండింగ్ లో ఉన్న శ్రీరెడ్డిపై కూడా తన ఫైర్ చూపించిందట అనసూయ.

టాలీవుడ్ లో రంకు-బొంకు అన్న స్కీమ్ తరహాలో తెగ ఇంటర్వ్యూలు ఇస్తున్న శ్రీరెడ్డి.. ఈ మధ్య కాలంలో కొన్నిసార్లు అనసూయ పేరు చెప్పింది. తాను.. అనసూయ.. గాయత్రి గుప్తా బ్యాచ్ మేట్స్ అని చెప్పింది శ్రీరెడ్డి. అయితే.. తన పేరు ఎందుకు చెబుతున్నావంటూ వాయించిందట అనసూయ. తన గురించి మంచిగానే చెప్పానన్న శ్రీరెడ్డి.. ఇకపై అనసూయ పేరెత్తను అంటోంది.

అంటే.. సోషల్ మీడియాలో ఆడపులి మాదిరిగా రెచ్చిపోయే అనసూయ.. అందరినీ భయపెడుతున్న శ్రీరెడ్డిని కూడా కంట్రోల్ లో పెట్టేసిందన్న మాట. అంతవరకూ బాగానే ఉంది కానీ.. అనసూయలోని ఈ ఫైర్ ను కెమేరా ముందు చూసే రోజులు ఎప్పుడు వస్తాయో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English