టాప్ ప్రొడ్యూసర్ కి కృష్ణవంశీ కౌంటర్

టాప్ ప్రొడ్యూసర్ కి కృష్ణవంశీ కౌంటర్

హై లెవెల్ లో ఉన్న వ్యక్తులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం అంతగా కనిపించని విషయం. ముఖ్యంగా ఫిలిం ఇండస్ట్రీలో వీలైనంతవరకూ హుందాగా ఉండేందుకు ప్రయత్నిస్తారు తప్ప.. అవకాశం దొరికిందనో.. మరే కారణంతోనో నేరుగా ఆరోపణలు చేయరు. చేయాల్సి వచ్చినా అవన్నీ ఇన్  డైరెక్టుగా మాత్రమే ఉంటాయి.

కానీ దర్శకుడు కృష్ణవంశీ మాత్రం నేరుగానే సురేష్ బాబుకు కౌంటర్ వేసేశారు. రీసెంట్ గా ఈ దర్శకుడు తన ట్విట్టర్ హ్యాండిల్ లో ఫాలోయర్స్ తో చిట్ చాట్ చేశాడు. తమ ఫీలింగ్స్ చెప్పిన ఫ్యాన్స్ కు.. తన అభిప్రాయాలను జోడించి మరీ చెప్పుకొచ్చాడు. అయితే.. 'సురేష్ బాబు లాంటి టాప్ ప్రొడ్యూసర్ బయటకు వచ్చి క్వాలిటీ ఫోటోగ్రఫీ లేదని.. సౌండ్ నాణ్యత ఉండదని.. కథలు సరిగా లేవని ఎందుకు మాట్లాడుతూ ఉంటార?' అని కృష్ణవంశీని ప్రశ్నించాడు. దీనికి 'తనే ఓ సినిమా తీసి చూపించవచ్చుగా' అంటూ ఆన్సర్ ఇచ్చాడు కృష్ణవంశీ.

తెలుగులో మంచి కథలు రావడం లేదని సురేష్ బాబు ఎప్పుడూ వాపోతూ ఉంటారనే సంగతి తెలిసిందే. మంచి కథలను తెరకెక్కించడం లేదని.. అసలు  కథలే దొరకడం లేదని కూడా అంటుంటారు సురేష్ బాబు. దానికి కౌంటర్ గానే.. మంచి కథ అంటే ఏంటో ఆయనే చెప్పి ఓ మంచి సినిమా తీసి చూపించచ్చుగా అన్నది కృష్ణవంశీ వెర్షన్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు