అక్క‌డా ఇక్క‌డా మ‌న‌వే టాప్‌!!

అక్క‌డా ఇక్క‌డా మ‌న‌వే టాప్‌!!

జీయో వ‌చ్చిన త‌ర్వాత యూట్యూబ్ వ్యూస్‌కి డిమాండ్ బాగా పెరిగింది. ఫ్రీగా రోజూ 1 జీబీ డేటా దాకా బ్రౌజింగ్ చేసుకునే అవ‌కాశం ఉండ‌డంతో, ఎక్కువ మంది కాల‌క్షేపానికి యూట్యూబ్ వీడియోల‌నే ఆశ్ర‌యిస్తున్నారు. అయితే దేశ‌వ్యాప్తంగా మిగిలిన రాష్ట్రాల‌తో పోల్చితే, ఇక్క‌డ యూట్యూబ్ వీడియోల పిచ్చి కాస్త ఎక్కువ‌గానే ఉంది.  గ‌త నాలుగు రోజులుగా మ‌న వీడియోలే ట్రెండింగ్‌లో టాప్‌లో నిల‌వ‌డం ఇందుకు నిద‌ర్శ‌నం.

రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్‌టీఆర్‌, రాజ‌మౌళి కాంబినేష‌న్‌లో సినిమా అన‌గానే క్రేజ్ మామూలుగా ఉండ‌దు. అయితే ఇన్నిరోజులు కేవ‌లం అంచ‌నాగా మాత్ర‌మే ఉన్న ఈ చిత్రాన్ని అధికారికంగా ‘ఆర్ ఆర్ ఆర్‌’ పేరుతో చిన్న ప్రొమో త‌యారుచేసి, విడుద‌ల చేసింది డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌. ఈ ప్రొమో వీడియో ఇప్పుడు దేశంలోనే టాప్‌లో ట్రెండ్ అవుతోంది. అలాగే రామ్‌చ‌ర‌ణ్ ‘రంగ‌స్థ‌లం’ సినిమాలోని ‘రంగా... రంగ‌స్థ‌లాన‌...’ పాటకి నాలుగు రోజులుగా మంచి వ్యూస్ వ‌స్తున్నాయి. శ్రీ‌రెడ్డి చేసిన సంచ‌ల‌న వ్యాఖ్య‌లు, ఇంకా హాట్ హాట్‌గా దేశ‌మంతా వైర‌ల్ అవుతున్నాయి. శ్రీ‌రెడ్డి ఓ వెబ్ ఛాన‌ల్‌కి ఇచ్చిన ఇంట‌ర్య్వూ టాప్ త్రీలో కొనసాగుతుండ‌డం ఇందుకు సాక్ష్యం. పాట‌లు లేకుండా, గ్రామీణ రాజ‌కీయాల‌ను చూపిస్తూ క‌ట్ చేసిన ‘రంగ‌స్థ‌లం’ థియేట్రిక‌ల్‌ ట్రైల‌ర్ విడుద‌లై నాలుగు రోజులైనా ఇంకా టాప్ 4లో ఉంది. ఇప్ప‌టికే 8.5 మిలియ‌న్ల దాటి, త్వ‌ర‌లో 10 మిలియ‌న్ల మైలురాయిని చేరడానికి దూసుకెళ్తున్నాడు చిట్టిబాబు. ఆప‌రేష‌న్ ద్ర‌విడ అంటూ శివాజీ చెప్పిన ర‌హ‌స్యాలు టాప్ 5లో ఉన్నాయి.

తెలుగు వీడియోలు దేశ‌మంతా టాప్‌లో ఉండ‌డం వెన‌క రెండు కార‌ణాలు క‌నిపిస్తున్నాయి. ఒక‌టి ప‌రీక్ష‌ల సీజ‌న్ కావ‌డంతో దేశవ్యాప్తంగా మొత్తం చ‌దువుల‌పై ఫోక‌స్ చేయ‌డం, రెండోది కొన్నాళ్లుగా తెలుగులో పెద్ద సినిమాలేవీ విడుద‌ల కాక‌పోవ‌డంతో వినోదం కోసం యూట్యూబ్‌నే ఆశ్ర‌యిస్తుండ‌డం. వ‌చ్చే వారం ‘రంగ‌స్థలం’ థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేదాకా యూట్యూబ్‌లోనూ మ‌న హ‌వా త‌గ్గ‌ద‌నే అనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు