అన్ని చెప్పి మళ్లీ బూతే తీశాడుగా

అన్ని చెప్పి మళ్లీ బూతే తీశాడుగా

కత్తి మహేష్.. ఇప్పుడీ పేరు తెలియని తెలుగు వ్యక్తి అంటూ ఉండడమే. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను రెచ్చగొట్టి మరీ తిట్టించుకుని.. టీవీ షోలలో రచ్చ చేసి పాపులారిటీ సంపాదించుకుని.. చివరకు వారితో కాంప్రమైజ్ అంటూ కథ సుఖాంతం చేసుకుని.. ఎట్టకేలకు తనకు ఓ సెలబ్రిటీ స్టేటస్ సంపాదించుకున్నాడు ఈ స్వయం ప్రకటిన సినీ విమర్శకుడు.

ఆ తర్వాత రాంగోపాల్ వర్మ తన జీఎస్టీని ప్రచారం చేసుకునేందుకు కత్తి వివాదాన్ని పక్కాగా వాడేసుకున్న వైనం బాగానే కనిపించింది. ఆ వాసనలు బాగానే అంటినట్లున్నాయి కత్తికి. అందుకే ఇప్పుడు తను ఓ వెబ్ సిరీస్ తీసేసి ఆడియన్స్ ముందుకు వచ్చేస్తున్నాడు. ఇన్ని కబుర్లు.. అన్ని నీతులు.. చెప్పిన ఓ విమర్శకుడు ఓ మాంచి సెటైరికల్ కాన్సెప్ట్ నో.. లేకపోతే మెసేజ్ ఓరియెంటెడ్ గానో ఈ సిరీస్ తీసి ఉంటాడని ఎక్స్ పెక్ట్ చేస్తాం. కానీ ఈయన మళ్లీ ఈరోటిక్ కామెడీ అంటూ.. బూతుకథనే వండాడు. పైగా మెచ్యూర్ అయిన ప్రేక్షకులకు మాత్రమే అంటూ పెట్టిన ట్వీట్ పై వెటకారాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి.

'లింగబాబు లవ్ స్టోరీస్' అన్నది కత్తి దర్శకత్వంలో రూపొందిన బూతు వెబ్ సిరీస్ టైటిల్ పేరు. రెండున్నర దశాబ్దాల క్రితం ఏపీలో బూతు సాహిత్యంపై నిషేధం విధించినప్పటి కాలానికి సంబంధించిన కథ ఇది. అప్పుడెప్పుడో రాసుకున్నదో.. అప్పటి ఆలోచనకు ఇప్పుడు తెరరూపం కల్పించినదో చెప్పలేం కానీ.. ఈ లింగబాబు లవ్ స్టోరీస్ ట్రైలర్ ఆరంభం నుంచి చివరి వరకూ ఏముందో రాసేందుకు కూడా అసహ్యం పుట్టించే డైలాగులు మాత్రమే ఉంటాయి. మరి పాతికేళ్ల క్రితం కొందరు కుర్రాళ్లు బూతు సాహిత్యం రాసి అమ్ముకుని డబ్బులు చేసుకోవాలనే కథతో.. ఈ తరం జనాలకు కత్తి మహేష్ ఏం చెప్పదలచుకున్నాడో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు