నిఖిల్‌ రాంగ్‌ ట్రాక్‌ పట్టాడా?

నిఖిల్‌ రాంగ్‌ ట్రాక్‌ పట్టాడా?

నలుగురితో నారాయణ తరహా పాత్రతో పరిచయమైన నిఖిల్‌ సోలో హీరోగా నిలదొక్కుకోవడానికి చాలా తంటాలు పడ్డాడు. ఎంతో కాలం తర్వాత కానీ తనకి ఎలాంటి సినిమాలు రైట్‌ అనేది అతను తెలుసుకోలేకపోయాడు.

స్వామిరారా, కార్తికేయ, ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి చిత్రాలతో హీరోగా ఆడియన్స్‌ నమ్మకాన్ని గెలుచుకున్న నిఖిల్‌ అదే తరహా విభిన్న కథలనే కేశవ, సూర్య వర్సెస్‌ సూర్య చిత్రాలకి కూడా ఎంచుకున్నాడు. అయితే హీరోగా సక్సెస్‌ అయ్యేసరికి నిర్మాతల తాకిడి పెరుగుతుంది. తనతో సినిమాలు చేస్తామంటూ వచ్చేవాళ్లు ఎక్కువ అవుతారు. ఆకర్షణీయమైన అమౌంట్‌ చెప్పి బుట్టలో వేసుకుంటారు.

అయితే నిర్మాత దొరికినంత ఈజీగా కథ దొరకదుగా. అందుకే నిఖిల్‌ రీమేక్స్‌ బాట పట్టాడు. ఒరిజినల్‌ స్క్రిప్టులని ఎంచుకుని సక్సెస్‌ అయిన నిఖిల్‌ ఇప్పుడు రాంగ్‌ ట్రాక్‌ పట్టేసాడనిపిస్తుంది. కన్నడలో బ్లాక్‌బస్టర్‌ కదా అని బ్లైండ్‌గా చేసిన 'కిరాక్‌ పార్టీ' ప్రేక్షకులని ఆకట్టుకోవడంలో విఫలమైంది.

ప్రస్తుతం అతను 'కనితన్‌' అనే తమిళ చిత్రం రీమేక్‌ చేస్తున్నాడు. ఆ చిత్రానికి అక్కడే సరయిన సమీక్షలు రాలేదు. ఇంతకుముందు 'ఫస్‌ గయారే ఒబామా' చిత్రాన్ని 'శంకరాభరణం'గా రీమేక్‌ చేసి దెబ్బ తిన్నాడు. ఎంచక్కా మంచి కథలు ఎంచుకునే టేస్ట్‌ వున్నపుడు ఇలా రీ'మేకులు' ఎందుకు దిగ్గొట్టుకుంటున్నాడో కదూ!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English