పవన్‌ ఆశీస్సులు అతనొక్కడికే

పవన్‌ ఆశీస్సులు అతనొక్కడికే

పవన్‌కళ్యాణ్‌ని తన సినిమా వేడుకలకి తీసుకురావడమే చాలా కష్టమనేది తెలిసిందే. తన కుటుంబం నిండా హీరోలున్నా కానీ వారి సినిమాల వేడుకలకి కూడా పవన్‌ గైర్హాజరు అవుతుంటాడు. సినిమా వేడుకలేమిటి, ఒక్కోసారి ఫ్యామిలీ ఈవెంట్స్‌కి కూడా పవన్‌ డుమ్మా కొట్టేస్తుంటాడు.

కేవలం నటుడిగా వున్నప్పుడే ఇలాగుంటే ప్రస్తుతం రాజకీయాలతో బిజీ అయిన పవన్‌ ఇక సినిమా వేడుకలకి వస్తాడా? మిగతా వారి మాట ఎలాగున్నా కానీ పవన్‌కి అమిత భక్తుడైన నితిన్‌కి మాత్రం పవన్‌ ఆశీస్సులు పుష్కలంగా వున్నాయి. నితిన్‌ తాజా చిత్రం 'ఛల్‌ మోహన్‌ రంగ' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి పవన్‌ ముఖ్య అతిథిగా వస్తున్నాడు. ఈ చిత్రానికి పవన్‌కళ్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌ సమర్పణ చేయడం గమనార్హం.

నిర్మాణ పరంగా భాగస్వామ్యం లేకపోయినా కానీ పవన్‌ బ్యానర్‌ని త్రివిక్రమ్‌ కోరిక మేర దీనికి వాడుకుంటున్నారు. ఎలాగో తన ముద్ర పడిన చిత్రమని వస్తున్నాడో లేక నితిన్‌కి సదా ఆశీస్సులు అందించే పెద్ద మనసుతో వస్తున్నాడో తెలీదు కానీ ప్రస్తుతం రాజకీయ చర్చల్లో తలమునకలవుతోన్న పవన్‌ని సినీ వేదికపై చూసే అవకాశం అభిమానులకి ఇలా దక్కుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు