విష్ణు.. నితిన్‌ను చూసి భయపడ్డాడా?

విష్ణు.. నితిన్‌ను చూసి భయపడ్డాడా?

జనవరి నెలాఖర్లోనే రావాల్సిన మంచు విష్ణు సినిమా ‘ఆచారి అమెరికా యాత్ర’ అనివార్య కారణాల వల్ల వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఇటీవలే కొత్త రిలీజ్ డేట్ ఇచ్చారు. ఏప్రిల్ 5న తమ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ తేదీకి కూడా సినిమా రావడం లేదు. మళ్లీ దీన్ని వాయిదా వేశారు. ఐతే వాయిదా అంటే మరీ ఎక్కువ రోజులు కాదు. ఒక్క రోజు ఆలస్యంగా ఏప్రిల్ 6న ‘ఆచారి అమెరికా యాత్ర’ను రిలీజ్ చేయాలని ఫిక్సయ్యారు.

ఏప్రిల్ 5వ తేదీ నితిన్ సినిమా ‘చల్ మోహన రంగ’ విడుదల కానున్న సంగతి తెలిసిందే. అది మరీ పెద్ద సినిమా ఏమీ కాదు. అయినా దాంతో పోటీ లేకుండా మరుసటి రోజు విష్ణు సినిమాను రిలీజ్ చేయాలనుకోవడం ఆశ్చర్యమే. తర్వాతి వారం నాని సినిమా ‘కృష్ణార్జున యుద్ధం’ భారీ అంచనాలతో రాబోతున్న నేపథ్యంలో విష్ణు సినిమా ఆరు రోజుల్లోనే చాలా వరకు పెట్టుబడిని వెనక్కి తేవాల్సి ఉంటుంది.

‘దేనికైనా రెడీ’.. ‘ఈడోరకం ఆడోరకం’ లాంటి హిట్ల తర్వాత విష్ణు-నాగేశ్వరరెడ్డి కాంబినేషన్లో రాబోతున్న సినిమా ‘ఆచారి అమెరికా యాత్ర’. చాలా విరామం తర్వాత సీనియర్ నిర్మాత ఎం.ఎల్.కుమార్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మించారు. విష్ణుతో పాటు బ్రహ్మానందం కీలక పాత్రలో నటించిన ఈ చిత్రంలో ప్రగ్యా జైశ్వాల్ కథానాయికగా నటించింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు