పాలిటిక్స్ ను ప్రోత్సహిస్తున్న కాజల్

పాలిటిక్స్ ను ప్రోత్సహిస్తున్న కాజల్

కళ్యాణ్ రామ్, కాజల్ ముఖ్యపాత్రలో ఎం.ఎల్.ఏ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మార్చ్ 23 న విడుదలకై సిద్ధంగా ఉండగా టీం అంతా ప్రోమోషన్లలో బిజీగా ఉన్నారు. అలానే ఒక ఇంటర్వ్యూ లో పాలిటిక్స్ గురించి ప్రశ్న అడగగా కాజల్ కల్పించుకుని మరీ చెప్పినా ఆన్సర్ వింటుంటే ఫాన్స్ కు కొత్త డౌట్లు కలుగుతున్నాయి.

ఇంటర్వ్యూ లో ఎం ఎల్ ఏ సినిమా తర్వాత మీకు కూడా పాలిటిక్స్ పైన ఇంటరెస్ట్ ఉందా అని అడగగా కళ్యాణ్ రామ్ లేదు అని చెప్పాడు. 'మంచిని చాలా సింపుల్ గా ప్రేక్షకులలో తీసుకెళ్లాలని అనుకుంటాను కానీ రుద్దాలి అని అనుకోను' అని కళ్యాణ్ రామ్ చెప్పగా, కాజల్ ఆ ప్రశ్నకు నేను మరికొంత జోడించి చెప్పాలి అనుకుంటున్నాను అంటూ తన ఒపీనియన్ షేర్ చేసుకుంది. "యాక్టర్లుగా మేము ప్రజల దగ్గరనుండి చాలా ప్రేమను పొందుతాం. ఆ ప్రేమ మాలో వాళ్ళకి ఎదో ఒక విధంగా తిరిగి ఇవ్వాలన్న బాధ్యతను పెంచుతుంది. వాళ్ళకి కచ్చితంగా ఎదో ఒకటి చేయలి అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ ఆదరణ, ప్రేమ అంత అధికంగా ఉంటాయి. వాళ్ళకి మేము ఎప్పుడు కృతజ్ఞతతో ఉంటాం." అంటూ చెప్పుకొచ్చింది.

అంతేకాదండోయ్..  "మేము కూడా ప్రజలని సరైన మార్గంలో వెళ్లేలా ప్రభావితం చేయాలని అనుకుంటాం. అలా మేము వాళ్ళకు తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది మా సామాజిక బాధ్యత. పైగా ఫామిలీలో ఎవరన్నా పాలిటిక్స్ లో ఉన్నప్పుడు వాళ్ళకి ఇంకా ఆ బాధ్యత ఉంటుంది" అని చెప్పి అందుకే ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్ లో అయిన ఆలోచించు అంటూ కళ్యాణ్ రామ్ కి చెప్పగా, నందమూరి హీరో 'తప్పకుండా. నేను కేవలం ప్రెసెంట్ గురించి చెప్పా అంతే' అన్నాడు.

అంఆ బాగానే ఉంది కాని కాజల్ మాటలు వింటుంటే ఒకవేళ సినిమా ఛాన్సులు తగ్గిపోతే వెంటనే రాజకీయాలలోకి వెళ్లిపోయేలా ఉంది. రేపొద్దున ఉన్నట్టుండి కాజల్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న మాట. కాని తెలుగురాని ఈ పాపకు తెలుగోళ్ళే రాజకీయాల్లో సీటివ్వాలేమో. ముంబాయ్ లో ఎవరు పట్టించుకుంటారు??!!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు