బన్నీకి ఎవ్వరూ భయపడట్లేదా?

బన్నీకి ఎవ్వరూ భయపడట్లేదా?

పెద్ద సినిమా వస్తోందంటే.. అందులోనూ భారీ బడ్జెట్.. విపరీతంగా థియేటర్లను ఆక్రమించే అవకాశం ఉన్న సినిమా వస్తున్నపుడు.. ఇతర సినిమాలు కాస్త గ్యాప్ ఇచ్చి రావాలని అనుకోవడం సహజం. ఇప్పటివరకూ ఉన్న ట్రెండ్ ఇదే కానీ.. సమ్మర్ లో ఈ లెక్క తేడా వస్తోంది. అల్లు అర్జున్ మూవీ నా పేరు సూర్య మే 4వ తేదీన విడుదల కానున్న సంగతి తెలిసిందే.

ఇంత పెద్ద సినిమా ఉన్నపుడు.. యావరేజ్ టాక్ తోనే 70 కోట్ల వసూళ్లు రాబట్టగల సత్తా ఉన్న బన్నీ సినిమా రిలీజ్ ఉన్నా సరే.. ఆ వెంటనే సినిమాలు షెడ్యూల్ అయిపోయాయి. మే నెల 9న మహానటి మూవీని.. మే 11న రాజ్ తరుణ్ మూవీ రాజుగాడును రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీన్ని చూస్తే.. బన్నీ మూవీకి ఎవరూ భయపడ్డం లేదా అనిపించక మానదు. బన్నీ సినిమా తర్వాత నాలుగు రోజులకే సినిమా అంటే బాగా ధైర్యం చేస్తున్నారనే ఫీలింగ్ కూడా కామన్. అయితే.. ఇలా బన్నీకి భయపడ్డం గట్రా లాంటివి ఈ సమ్మర్ సీజన్ కు వర్తించవు.

ఎందుకంటే ఈ సారి మార్చ్ నుంచి మొదలుపెడితే.. ప్రతీ వారం ఓ కొత్త సినిమా.. అందులోను మినిమిం మీడియం బడ్జెట్ నుంచి హై బడ్జెట్ లోపు మూవీస్ రిలీజ్ కానున్నాయి. అంటే అందరికీ ఉన్నది ఒక వారం గ్యాప్ మాత్రమే. బన్నీ మూవీకి ఇంకో రెండ్రోజులు ఎక్కువగా తగ్గుతోందంటే. కానీ సమ్మర్ సీజన్ కావడంతో.. కంటెంట్ బాగుండాలే కానీ తక్కువ థియేటర్లతో భారీ షేర్ రాబట్టేయచ్చు అన్నది నిర్మాతల ఐఢియా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు