కాంగ్రెస్ నేత‌ల మైండ్ బ్లాంక్ చేస్తున్న రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ నేత‌ల మైండ్ బ్లాంక్ చేస్తున్న రేవంత్ రెడ్డి

ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న నాయ‌కుడు త‌మ పార్టీ కీల‌క‌మైన క‌ష్ట‌కాలంలో ఉన్న స‌మ‌యంలో అస‌లేమాత్రం స్పందించ‌క‌పోతే...పైగా కీల‌క‌మైన అసెంబ్లీలో త‌మ గ‌ళం వినిపించేందుకు కూడా లేక‌పోవ‌డంతో తెలంగాణ‌లో అధికార‌ప‌క్ష‌మైన కాంగ్రెస్‌లో అయోమ‌యం నెల‌కొంది. టీడీపీ పార్టీ మారిన కాంగ్రెస్ రేవంత్ విష‌యంలో కాంగ్రెస్ నేత‌లు అయోమ‌యానికి గురవుతున్నార‌ని అంటున్నారు. కొద్దికాలం క్రితం ఆయన టీడీపీ నుండి కాంగ్రెస్‌పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు పూర్తయ్యే వరకు కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యేలను స్పీకర్‌ సస్పెండ్‌ చేసినా, ఆ పార్టీ తరపున ఒకే ఒక్క ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి సస్పెండ్‌ కాలేదు. అయినా ఆయ‌న అసెంబ్లీకి హాజ‌రుకాకపోవ‌డంతో పార్టీ నాయ‌కులు అయోమ‌యంలో ప‌డిపోతున్నారు. ఈ గైర్హాజ‌రుపై రేవంత్ వ్యూహం ఏమిటో అర్థం కావ‌డం లేదంటున్నారు.

వాస్త‌వానికి కాంగ్రెస్‌పార్టీలో చేరినరోజే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్టు రేవంత్‌రెడ్డి ప్రకటించారు.రాజీనామా లేఖను ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు అందించానని, దీంతో తాను రాజీనామా చేసినట్టేనని అంటున్నారు. వాస్తవానికి ఆయన చంద్రబాబుకు రాజీనామా లేఖ ఇచ్చారా? ఒకవేశ ఇస్తే ఆ లేఖను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు చంద్రబాబు పంపించారా? ప్రస్తుతం రేవంత్‌ రాజీనామా లేఖ స్పీకర్‌ కార్యాలయంలో ఉందా? అన్న ప్రశ్నలకు సమాధానాలు లేవు. స్పీకర్‌ కార్యాలయం వర్గాలు మాత్రం తమ వద్దకు ఎలాంటి రాజీనామా లేఖ రాలేదని అంటున్నారు. ఇందులో వాస్తవమెంత అన్నదానిపై సృష్టత రావాలంటే, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ మధుసూదనాచారి, రేవంత్‌రెడ్డితో పాటు ఏపీ సీఎం చంద్రబాబు స్పందించాల్సి ఉంది.

మ‌రోవైపు త‌ను రాజీనామా చేసినందుకే అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడం లేదని రేవంత్ చెబుతున్నారు. అయితే, రాజీనామా చేశాను కాబట్టి అసెంబ్లీకి రానని చెబుతున్న రేవంత్‌ రెడ్డి మాత్రం తన నియోజకవర్గమైన కొడంగల్‌ లో మాత్రం అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటుండ‌టం ప‌ట్ల కాంగ్రెస్ పార్టీ నేత‌లు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. రాజీనామా చేసిన వ్యక్తి నియోజకవర్గంలో ఎందుకు పాల్గొంటున్నాడని కానీ అసెంబ్లీకి మాత్రం రావ‌డం లేదని, త‌మ గ‌ళం వినిపించేందుకు ప్ర‌య‌త్నించ‌డం లేదంటున్నారు. అయితే,  మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ రాజీనామా మాదిరిగానే , రేవంత్‌రెడ్డి రాజీనామా హైడ్రామా నడుస్తున్నదని స‌మాచారం. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ రాజీనామా లేఖ అందిందని స్పీకర్‌ చెబితే, తాను కూడా తన రాజీనామా లేఖను రేవంత్‌రెడ్డి అందించే అవకాశం ఉంది. ఇప్పట్లో ఈ రెండూ తేలవని ప‌లువురు అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు