మ‌రో స్కాం...ఇప్పుడు ఎస్‌బీఐ బ‌లి

మ‌రో స్కాం...ఇప్పుడు ఎస్‌బీఐ బ‌లి

మ‌రో భారీ స్కాం వెలుగులోకి వ‌చ్చింది. అయితే ఇది వజ్రాల‌ది కాదు..బంగారు ఆభ‌ర‌ణాల‌ది. ప్రముఖ జ్యూయలరీ సంస్థ బ్యాంకులను భారీగా మోసగించినట్లు తాజాగా మ‌రొక‌టి వెలుగులోకి వచ్చింది. చెన్నైకి చెందిన కనిష్క్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.842.15కోట్ల రుణం తీసుకొని ఎగ్గొట్టినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీబీఐకి ఫిర్యాదు చేసింది. చెన్నైలో టీ నగర్‌లో రిజస్టర్ అయిన కనిష్క్ గోల్డ్ సంస్థకు భూపేశ్ కుమార్ జైన్ అత‌ని భార్య నీతా జైన్ ప్రమోటర్లు, డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. వాళ్లిద్దరి ఆచూకీ తెలుసుకోలేకపోతున్నామని, వాళ్లు ప్రస్తుతం మారిషస్‌లో ఉంటున్నారని భావిస్తున్నట్లు బ్యాంకింగ్ వ‌ర్గాలు అంచనా వేస్తున్నాయి.

తమిళనాడు వ్యాప్తంగా ఉన్న కనిష్క్ జ్యువెలర్స్.. 14 బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.824 కోట్ల రూపాయలు చెల్లించలేదంటూ సీబీఐకి ఎస్బీఐ కంప్లయింట్ చేసింది. దీంతో ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే చెన్నైకి చెందిన కనిష్క్ గోల్డ్ జ్యువెలర్స్.. తమిళనాడు వ్యాప్తంగా పెద్ద పెద్ద షోరూమ్స్ ఓపెన్ చేసింది. ఇందులో భాగంగా ప్రముఖ లీడింగ్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.824 కోట్లు అప్పు తీసుకున్నారు ఓనర్ భూపేష్ కుమార్ జైన్. డైరెక్టర్ గా అతని భార్య నీతా జైన్ ఉన్నారు. 14 బ్యాంకుల కన్సార్టియం SBI  నుంచి అప్పులు తీసుకుంది. విడతల వారీగా ఇప్పటి వరకు మొత్తం రూ.824 కోట్లు తీసుకున్నది.

అప్పు తిరిగి చెల్లించటంలో కనిష్క్ గోల్డ్ జ్యువెలర్స్ విఫలం అయ్యింది. దీనికితోడు ఎలాంటి సమాచారం లేకుండా కొన్ని దుకాణాలను మూసివేయటం, రికార్డులు తారుమారు చేయటం వంటివి చేసినట్లు బ్యాంక్ గుర్తించింది. వెంటనే సీబీఐకి ఫిర్యాదు చేసింది బ్యాంక్. అయితే ఇప్పటికే భూపేష్ కుమార్ జైన్ కుటుంబం విదేశాలకి వెళ్లిపోయినట్లు భావిస్తున్నారు. దేశంలో అతని ఆచూకీ లభ్యం కావటం లేదనేది ప్రాథమిక సమాచారం. మారిషస్ దేశం వెళ్లినట్లు అతని సన్నిహితులు చెబుతున్నారు.

2017 నవంబర్ లోనే కుమార్ జైన్ ను అప్పు ఎగవేతదారుడిగా పలు బ్యాంకులు ప్రకటించాయి. ఆ క్రమంలోనే రూ.20 కోట్లు ఎక్సైజ్ ట్యాక్స్ ఎగ్గొట్టిన కేసులో అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత బెయిల్ పై విడుదల అయిన భూపేష్ కుమార్..  కనిపించకుండా వెళ్లిపోయాడు. చెన్నై, ముంబై, బెంగళూరు, కొచ్చి, హైదరాబాద్ నగరాల్లో కనిష్క్ గోల్డ్ జ్యువెలరీస్ పేరిట ఫ్రాంఛైజీలు ఉన్నాయి. వారి నుంచి కూడా భారీ మొత్తంగా డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు