బాడీ బాగుంది.. మరి యాక్టింగో?

బాడీ బాగుంది.. మరి యాక్టింగో?

మహేష్‌బాబు బావమరిది సుధీర్‌బాబు హీరోగా నిలదొక్కుకోవడానికి గంటల కొద్దీ కష్టపడుతున్నాడు. యాక్టింగ్‌ స్కూల్లోనో, లేదా షూటింగ్‌ స్పాట్‌లోనో కాదు. జిమ్‌లోను... డాన్సింగ్‌ క్లాసుల్లోను! తెలుగు సినిమా హీరోగా నిరూపించుకోవడానికి ముందు తన బాడీతో మాట్లాడించాలని సుధీర్‌ డిసైడ్‌ అయ్యాడు. అందుకే కండలు ఉండలు చేసేసుకుని 'ఆడు మగాడ్రా బుజ్జీ' అని అందరి చేతా అనిపించుకోవాలని ట్రై చేస్తున్నాడు. సుధీర్‌బాబు ఇప్పుడు ఆంధ్రా సల్మాన్‌ఖాన్‌లా చొక్కా విప్పుకుని తిరుగుతున్నాడు... సినిమాలోనేలెండి. బాడీ వరకు బాగానే ఉంది. మరి యాక్టింగ్‌ సంగతేంటి? సుధీర్‌ ఇంతవరకు రెండు సినిమాలు చేశాడు కానీ యాక్టింగ్‌ అయితే నిల్‌. బ్లాంక్‌ ఫేస్‌ పెట్టుకుని అలా డైలాగులు అప్పజెప్పేస్తుంటాడు.

తన బావ మహేష్‌ ముందు నటుడిగా తనని తాను నిరూపించుకుని, అవసరాన్ని బట్టి ఇప్పుడు బాడీ బిల్డ్‌ చేస్తున్నాడు. సుధీర్‌ అతనికి అభిముఖంగా వెళ్తూ ముందు బాడీ బిల్డ్‌ చేసి పారేశాడు. ఈ ఫిజిక్‌కి మోడల్‌గా ఓకే. కానీ హీరోకి అయితే యాక్టింగ్‌ కూడా తెలిసుండాలి. మూడో సినిమాలో అయినా తన టాలెంట్‌ తెలిసేట్టు సుధీర్‌ నటించి ఉంటాడనే అనుకుందాం. 'నువ్వు యాక్టర్‌రా బుజ్జీ' అని ప్రశంసిద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు