అమ్మాయి పెళ్లి చేసుకోద‌నే చ‌దువుతామ‌న్న యంగ్ హీరో

అమ్మాయి పెళ్లి చేసుకోద‌నే చ‌దువుతామ‌న్న యంగ్ హీరో

ప్రీరిలీజ్ ఫంక్ష‌న్ అంటే.. తాము చేసిన సినిమా గురించి కాసిన్ని గొప్ప‌లు చెప్పుకోవ‌టం. సినిమా కోసం తామెంత క‌ష్ట‌ప‌డింది.. ఎంత డిఫ‌రెంట్ గా ఉంటుంద‌న్న విష‌యాన్ని అదే ప‌నిగా చెబుతుంటారు. అంతేనా.. తాము చేసింది ఎంత మంచి సినిమానో అంటూ వివ‌రించ‌టానికి కిందా మీదా ప‌డుతుంటారు. హీరో ద‌గ్గ‌ర నుంచి టెక్నిష‌య‌న్ వ‌ర‌కూ మైకు ప‌ట్టుకున్న ప్ర‌తిఒక్క‌డూ సినిమా పొగిడేసేవాడే.

ఇది రోటీన్‌. దీనికి భిన్న‌మైన ఫంక్ష‌న్ తాజాగా జ‌రిగింది. నీది నాది ఒకే క‌థ మూవీ ప్రీరిలీజ్ ఫంక్ష‌న్ జ‌రిగింది. ఇందులో హీరోగా న‌టిస్తున్నాడు శ్రీ‌విష్ణు. అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు.. మెంట‌ల్ మ‌దిలో అంటూ చేసిన సినిమాలు అత‌గాడికి గుర్తింపుతో పాటు.. కాస్త డిఫ‌రెంట్ గా  ఈ యంగ్ హీరో సినిమాలు ఉంటాయ‌న్న పేరును తెచ్చుకున్నాడు.

తాజాగా తాను న‌టించిన సినిమా ప్రీరిలీజ్ ఫంక్ష‌న్ లో తాను చేసిన తాజా చిత్రం ముచ్చ‌ట్ల‌తో పాటు.. కొన్ని విష‌యాల్ని స‌రికొత్త‌గా చెప్పుకొచ్చాడు.  

కుర్రాళ్లు చ‌దివేది త‌మ కోసం కాద‌ని.. త‌ల్లిదండ్రుల కోస‌మో.. సొసైటీ కోస‌మోన‌ని చెప్ప‌ట‌మే కాదు.. ఇంజ‌నీర్ కాకుంటే పిల్ల‌ను ఇవ్వ‌రేమోన‌ని చ‌దువుతామంటూ ఓపెన్ అయ్యాడు. అమ్మాయి పెళ్లి చేసుకోదేమోన‌న్న భ‌యంతో చ‌ద‌వుతాం. ఒక్క ఇంజ‌నీరింగ్ మాత్ర‌మే కాదు.. చాలా విష‌యాల్లో అంతే. ఇంజ‌నీరింగ్ అన్న‌ది జ‌స్ట్ ఉదాహ‌ర‌ణ మాత్ర‌మేన‌న్నాడు. ఐటీ ఇంజ‌నీర్లను తాను ఒక ప్ర‌శ్న అడుతున్నాన‌ని.. ఉద్యోగం చేసి ఇంటికి వెళ్లి ప‌డుకునే ముందు ఏంట్రా.. ఇదేం జాబురా అని ఎన్నిసార్లు అనుకొని ఉంటారు? అని ప్ర‌శ్నించారు.

తాను చెప్పిన మాట‌లో నిజం ఎంత‌న్న‌ది గుండెల మీద చేయి వేసుకోని చెప్పాల‌న్నారు. ప్ర‌తి సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్ ఇంటికి వెళ్లి బాధ ప‌డుతుంటాడ‌ని.. లేకుంటే ప్ర‌తిరోజూ ఎంజాయ్ చేస్తాడ‌న్నారు. అందుకే.. ఎలాంటి కెరీర్ ఎంచుకోవాల‌న్న విష‌యాన్ని కుర్రాళ్లు త‌మ పేరెంట్స్ కు క‌న్వీన్స్ చేయాల‌న్నారు. ఒక అమ్మాయి ఒక‌సారి ఐ ల‌వ్యూ చెబితే ఒప్పుకోదు.. ఐదు.. ప‌ది.. ప‌దిహేనుసార్లు చెప్పి ఒప్పించాల్సి ఉంటుంది. ఒక‌వేళ ఒప్పుకోకుంటే.. ఆ అమ్మాయి వెంట తిరుగుతూనే ఉంటాం. మ‌రి.. మ‌న కెరీర్ కోసం త‌ల్లిదండ్రుల్ని ఒప్పించాలి క‌దా?  పేరెంట్స్ కూడా పిల్ల‌ల‌కు స‌పోర్ట్ చేయాలి. చ‌దువు వ‌స్తే వ‌చ్చింది లేక‌పోతే లేదు. ఎక్కువ టెన్ష‌న్ ప‌డ‌కూడ‌దు. పేరెంట్స్ కూడా త‌మ పిల్ల‌లు ఏది ఇష్ట‌మన్న‌ది అడ‌గాలి. వారు చెప్పేది వినాల‌ని.. అంద‌రి క‌థ ఒక‌టేన‌ని.. త‌మ సినిమా అలానే ఉంటుందంటూ చెప్పిన మాట‌లు విన్న‌ప్పుడు.. రోటీన్ కు కాస్త భిన్నంగా అనిపించ‌ట్లేదు..?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు