రంగస్థలం గ్రామం.. అంత తేలికేం కాదు

రంగస్థలం గ్రామం.. అంత తేలికేం కాదు

సినిమా అంటే దర్శకుడి మేథో సంపత్తి.. హీరోకు ఉండే క్రేజ్.. హీరోయిన్ కి ఉన్న గ్లామర్.. మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చే సంగీతం.. ఫోటోగ్రాఫర్ పనితనం.. ఇప్పటివరకూ జనాలకు బాగా తెలుస్తున్న క్రాఫ్ట్స్ ఇవే. అయితే.. వీటితో పాటు సమానంగా మరో విభాగానికి కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది. అదే ఆర్ట్ డైరెక్షన్.

ఓ సినిమా థీమ్ కు తగినట్లుగా ప్రాపర్టీస్ డిజైన్ చేయడం ఈ ఆర్ట్ డైరెక్టర్ పని. ఇప్పుడు తెలుగు సినిమాల్లో కూడా ఈ విభాగానికి ఇంపార్టెన్స్ పెరుగుతోంది. అందాల రాక్షసి మూవీతో తమ ప్రయాణం ప్రారంభించిన ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ.. తన భార్య మౌనికతో కలిసి సంచలనాలు సృష్టిస్తున్నారు. సాహసం.. భలే మంచి రోజు.. వంటి చిత్రాలకు తమ ప్రతిభ చూపించిన ఈ జంట.. ఇప్పుడు రంగస్థలం మూవీకి కూడా వీరే ఆర్ట్ డిజైనింగ్ చేశారు. మూడు దశాబ్దాలకు పూర్వం ఉన్న గ్రామాన్ని ఇప్పుడు రీక్రియేట్ చేయడం అంటే.. అది కష్టం కాదని.. ఛాలెంజ్ తో కూడుకున్న విషయం అంటున్నారు రామకృష్ణ. దర్శకుడి విజన్ ని.. కథకు తగ్గ థీమ్ ని.. నిర్మాత అందించే బడ్జెట్ ను అన్నిటినీ దృష్టిలో ఉంచుకుని కళా దర్శకత్వం వహించాలని చెబుతున్నారు.

రాజమండ్రి పరిసరాలతో పాటు అక్కడి జనాలను ఎంతోమందిని ఇంటర్వ్యూలు చేసి.. బోలెడంత రీసెర్చ్ చేసి రంగస్థలం గ్రామాన్ని సృష్టించామని చెప్పాడు రామకృష్ణ. ప్రస్తుతం వీరు సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహించనున్న స్పేస్ మూవీ.. ఎన్టీఆర్ బయోపిక్ లకు కూడా వర్క్ చేయనున్నారు. అయితే.. తాము అందించిన సినిమాల్లో అన్నిటికంటే క్లిష్టమైన వర్క్ మాత్రం సాహసం అని చెప్పడం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English