స్టార్ హీరో ఇలా చేశాడేంటి?

స్టార్ హీరో ఇలా చేశాడేంటి?

గత కొంత కాలంగా హై వర్చువల్ ప్రింట్ ఫి (VPF) తో సతమతమవుతోన్న పలు ఇండస్ట్రీలు ఇటీవల రేట్లు తగ్గించమని డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్  (DSP) ని కోరుతోన్న సంగతి తెలిసిందే. కానీ వారు ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడంతో సిని నిర్మాతలు ఆందోళన చేపట్టారు. సినిమాలకు సంబందించిన ఎటువంటి పనులను చేయకూడదు అని షూటింగ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నింటికీ బంద్ అని చెప్పేశారు.  

మొన్నటి వరకు టాలీవుడ్ కూడా మూడు రోజులు చేసింది. కానీ ఎక్కువ రోజులు ఓపిక పట్టలేదు. ఆ సంగతి పక్కనపెడితే కోలీవుడ్ లో మాత్రం సినీ ప్రముఖులందరు డిమాండ్స్ కి కట్టుబడి ఏకమయ్యారు. అగ్రదర్శకుల సినిమాలు సైతం పెండింగ్ లో పడ్డాయి. దీంతో వారి మధ్య యూనిటి బావుందని ఇతర సినీ పరిశ్రమలలో అనేక కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఒక్క హీరో సినిమా షూటింగ్ మాత్రం యధావిధిగా సాగడం హాట్ టాపిక్ అయ్యింది. ఇళయదళపతి విజయ్ సామజిక సేవలో ఎప్పుడు ముందుటాడు. కానీ కోలీవుడ్ బంద్ లో మాత్రం పాల్గొనడం లేదు.  తను ఎఆర్.మురగదాస్ తో చేస్తోన్న సినిమా కోసం కష్టపడుతున్నాడు. బంద్ కొనాగుతున్నప్పటికీ రెండు రోజుల స్పెషల్ పర్మిషన్ తో షూటింగ్ చేయడానికి సిద్దమయ్యాడు.

కొన్ని రోజుల క్రితం సెట్ చేసుకున్న షెడ్యూల్ కావున షూటింగ్ నిర్వహించక తప్పలేదట. తెలుగు మళయాలం టెక్నీషియన్స్ తో స్పెషల్ సెట్స్ లో షూటింగ్ చేస్తున్నారని వారి డేట్స్ మళ్లీ దొరకవని నిర్మాత మండలిని వివరణ కోరారు. అయితే పర్మిషన్స్ రావడంతో కొంతమంది సినీ ప్రముఖులే ఈ విషయంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.  

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు