నాని ప్లానింగ్‌ అదుర్స్‌

నాని ప్లానింగ్‌ అదుర్స్‌

మొదట్లో తన సినిమాలకి ప్రేక్షకులని ఎలా రాబట్టాలా అని ఆలోచించాల్సిన పరిస్థితి. నాని నటించిన సినిమాల్లో కొన్ని బాగున్నవి కూడా సరిగా ఆడకపోవడం జరిగింది. అలాంటిది ఇప్పుడు యావరేజ్‌ సినిమాలని కూడా సూపర్‌హిట్‌ చేసేస్తున్నాడు. నాని సినిమాలకి గ్యారెంటీ ఆడియన్స్‌ వుండడంతో అతనితో సినిమాలు తీయడానికి నిర్మాతలు ఎగబడుతున్నారు.

క్లాస్‌, ఫ్యామిలీస్‌లో స్థిరపడిపోయిన నాని ఇక మాస్‌ వర్గాన్ని ఆకట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసాడు. తన తదుపరి చిత్రం కృష్ణార్జున యుద్ధం అలా మాస్‌ని టార్గెట్‌ చేసినదే. ఇదిలావుంటే బిగ్‌బాస్‌ షో సీజన్‌ 2కి నాని హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఎన్టీఆర్‌ హోస్ట్‌ చేసిన షోకి ఈసారి మహేష్‌ లేదా అల్లు అర్జున్‌ వుంటారని అనుకున్నారు. కానీ నాని కూడా ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా దగ్గరివాడేనని అతడితో ఈ షో చేయిస్తున్నారు. నిజానికి నాని ఇప్పుడున్న బిజీలో ఈ షోకి టైమ్‌ ఇవ్వలేడు.

కానీ బిగ్‌బాస్‌ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తే మాస్‌లోకి చొచ్చుకుపోవాలనే తన పని సులువైపోతుంది. అందుకే అంత బిజీ షెడ్యూల్‌లోను దీనిని మిస్‌ కాలేదు. పైగా ఈ షోకి వ్యాఖ్యానం చేయడానికి ఇంత కావాలి, అంత కావాలి అంటూ డిమాండ్లు కూడా చేయలేదట. అయితే నాని పాపులారిటీని దృష్టిలో వుంచుకుని స్టార్‌-మా అతడికి భారీగానే ముట్టజెప్తుందనుకోండి. ఏదేమైనా ప్లానింగ్‌ విషయంలో తన సమకాలీన హీరోల్లో నాని ఒక నాలుగాకులు ఎక్కువే చదివాడని ఇది తెలియజెప్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English