ఈసారీ ఆరుకు త‌గ్గ‌లేదు.. ఛాయిస్ మీదే

ఈసారీ ఆరుకు త‌గ్గ‌లేదు.. ఛాయిస్ మీదే

దేన్లో అయినా ఛాయిస్ ఉండే ఆ సుఖ‌మే వేరు. ప్ర‌తి వారం శుక్ర‌వారం వ‌స్తుందంటే.. కొత్త సినిమాలు థియేట‌ర్ల‌ను ప‌లుక‌రించే వేళ‌.. వీలైన‌న్ని ఎక్కువ సినిమాలు విడుద‌ల కావాల‌న్న ఆశ స‌గ‌టు సినీ అభిమానిలో క‌నిపిస్తుంటుంది. అయితే.. లెక్కేసుకున్నట్లుగా కొన్నిసార్లు సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. పెద్ద సినిమాల రిలీజ్ కు వారం ముందు.. త‌ర్వాత రిలీజ్ లు పెద్ద‌గా ఉండ‌వు. ఈ మ‌ధ్య‌న పెద్ద సినిమాలు విడుద‌లై చాలా కాల‌మే అయ్యింది.

ఈ మంత్ ఎండింగ్ నుంచి పెద్ద సినిమాలు ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా.. లెక్క‌గా రిలీజ్ అవుతున్న వేళ‌.. చిన్న సినిమాలు గ‌డిచిన రెండు వారాలుగా విజృంభిస్తున్నాయి. గ‌త శుక్ర‌వారం ఎనిమిది సినిమాలు విడుద‌ల కాగా.. ఈసారి ఆరు సినిమాలు విడుద‌ల‌వుతూ.. చూసుకున్నోళ్ల‌కు చూసుకున్నంత అంటూ ఊరించేస్తున్నాయి.

గ‌త వారంతో పోలిస్తే.. ఈ వారం విడుద‌ల‌య్యే సినిమాల్లో ఒక మోస్త‌రు పెద్ద సినిమా ఒక‌టి ఉంది. క‌ల్యాణ్ రాం న‌టించిన ఎమ్మెల్యే.. మీద పెద్ద ఆశ‌లే ఉన్నాయి. కాజ‌ల్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీ  విజ‌యం మీద పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. మ‌రి.. ప్రేక్షక దేవుళ్లు ఎలాంటి తీర్పు ఇస్తారోచూడాలి. ఇక‌.. ఈ వారం విడుద‌ల‌య్యే ఆరు సినిమాలు ఏమిట‌న్న‌ది చూస్తే..

1. ఎమ్మెల్యే
2. నీదీ నాదీ ఒకే క‌థ‌
3. అన‌గ‌న‌గా ఒక ఊళ్లో..
4. ఆనందం
5. రాజ‌ర‌థం
6. మ‌ర్ల‌పులి

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English