త్రివిక్రమ్‌ స్క్రిప్ట్‌తో ఎన్టీఆర్‌ నాట్‌ హ్యాపీ!

 త్రివిక్రమ్‌ స్క్రిప్ట్‌తో ఎన్టీఆర్‌ నాట్‌ హ్యాపీ!

అజ్ఞాతవాసి చిత్రంతో ఎదురుదెబ్బ తిన్న త్రివిక్రమ్‌ తన తదుపరి చిత్రాన్ని ఎన్టీఆర్‌తో తలపెట్టాడు. అజ్ఞాతవాసి విడుదలకి ముందే స్క్రిప్ట్‌ లాక్‌ అయిపోయినా కానీ, ఆ ఫలితాన్ని దృష్టిలో వుంచుకుని దీనికి చాలా మార్పులు చేసారు. అనిరుధ్‌ని తొలగించి తమన్‌ని సంగీత దర్శకుడిగా ఎంపిక చేసిన సంగతి కూడా తెలిసిందే.

ఫిబ్రవరిలోనే షూటింగ్‌ మొదలు కావాల్సిన ఈ చిత్రం ఇప్పుడు ఏప్రిల్‌లో సెట్స్‌ మీదకి వెళుతోంది. ఈ చిత్రానికి ముందు అనుకున్న కథకి చాలా మార్పులు జరిగాయని, అయితే ఇప్పటికీ ఎన్టీఆర్‌ కథ విషయంలో పూర్తి స్థాయిలో సంతృప్తిగా లేడని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే హారిక హాసిని సంస్థ దగ్గర్నుంచి ఫుల్‌ పేమెంట్‌ రావడం, తనకి కూడా మరో కమిట్‌మెంట్స్‌ లేకపోవడం, ఎలాగో ఫాలో అప్‌ సినిమా రాజమౌళిది కావడంతో త్రివిక్రమ్‌ కథపై పూర్తి నమ్మకం లేకపోయినా కానీ ఈ చిత్రం చేసేస్తున్నాడని చెవులు కొరుక్కుంటున్నారు.

ఈ చిత్రాన్ని ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లో సెట్‌ చేయడం వల్ల క్యారెక్టర్‌కి అనుగుణంగా ఎన్టీఆర్‌ బాడీ పెంచుతున్నాడట. ఎన్టీఆర్‌ లుక్‌ పరంగా క్రేజ్‌ తీసుకొచ్చేలా సకల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. త్రివిక్రమ్‌ సినిమాల్లో వుండే కామెడీ పార్ట్‌ ఈ చిత్రానికి పర్‌ఫెక్ట్‌గా సెట్‌ కాలేదనేది మెయిన్‌ కంప్లయింట్‌. త్వరలో షూటింగ్‌కి వెళుతున్నా కానీ ఇంకా కామెడీ పార్ట్‌ వరకు వర్క్‌ జరుగుతూనే వున్నట్టు టాక్‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు