కామెంట్: పరదేశీల ప్రేమలో మన భామలు

కామెంట్: పరదేశీల ప్రేమలో మన భామలు

ప్రేమకు కులం, గోత్రం, రాష్ట్రం, దేశం అంటూ బేధాలు ఉండవు, ఎప్పుడు ఎక్కడ ఎవరి మీద ప్రేమ కలుగుతుందో ఎవరూ చెప్పలేరు అంటూ ఉంటారు. ఆ మాటనే మన సెలెబ్రిటీలు నిజం చేస్తున్నారు. మన దేశంలో కాకుండా పక్క దేశాలలో ప్రేమలో పడ్డ కొంతమంది సెలెబ్రెటీల గురించి ఒక లుక్కేయండి.

దేవదాసు సినిమాతో ఎంట్రీ ఇచ్చి, మహేష్ బాబు, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో నటించి ఇప్పుడు బాలీవుడ్లో సెటిల్ అయిన ఇలియానా ఒక ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తో ప్రేమలో పడింది. వీరిద్దరికి పెళ్లి కూడా అయిపోయిందని టాక్. మొన్నటికి మొన్న సీనియర్ హీరోయిన్ శ్రియ.. టెన్నిస్ ప్లేయర్ మరియు బిజినెస్ మ్యాన్ ఆండ్రూ కోస్చీవ్ ను సెక్రెట్ గా పిల్లాడి రష్యా ఇంటి కోడలు అయ్యింది.

శ్రుతి హాసన్  లండన్ అబ్బాయి మైఖేల్ కొర్సల్ ప్రేమలో పీకలదాకా మునిగిపోయింది. టక్కరి దొంగ బ్యూటీ లిసా రే కూడా లేబనాన్ కు చెందిన జేసన్ డేహ్నిను పెళ్లిచేసుకుంది. ఖడ్గం ఫేమ్ కిమ్ శర్మ కెన్యా బిజినెస్ మాన్ అలీ పుంజాని అనే హాఫ్‌ ఇండియన్ ను ప్రేమించి పెళ్ళాడింది.  టాలీవుడ్లోనే కాదండోయ్ బాలీవుడ్లో కూడా ఇలానే ఓ గంపెడు ఉన్నారు.

మోస్ట్ ఎలిజిబుల్ బాచిలరుగా పిలవబడే సల్మాన్ ఖాన్.. జై హో సినిమా షూటింగుకు రోమానియా వెళ్లి అక్కడే లులియా వంతుర్ అనే అమ్మాయికి మనసిచ్చి వచ్చాడు. ప్రీతి జింటా కూడా అమెరికా అబ్బాయి జీని గుడెనఫ్ ను పెళ్లిచేసుకుని హ్యాపీగా సెటిల్ అయిపోయింది. సెలీనా జైట్లీ ఆస్ట్రియా దేశస్తుడు పీటర్ హాగ్ తో ఏడూ అడుగులు నడిచి కవల పిల్లలకు తల్లి కూడా అయ్యింది. కంగనా రనౌత్ కూడా యూకే లో డాక్టర్ అయిన నికోలస్ లాఫర్టీతో కొన్నాళ్ళు ప్రేమ వ్యవహారం నడిపి విడిపోయింది.

వీళ్లంతా ఒక ఎత్తు అయితే శశి కపూర్ 1958 లోనే ఇంగ్లాండ్ నటి జెన్నిఫర్ కేండాల్ ను పెళ్ళి చేసుకున్నారు. అది సంగతి.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు