ట్రై చేస్తే.. ర‌కుల్ తో జ‌ర్నీ చేసే ఛాన్స్!

ట్రై చేస్తే.. ర‌కుల్ తో జ‌ర్నీ చేసే ఛాన్స్!

క‌ల‌ల దేవ‌త‌గా.. వెండితెర వేల్పుగా వెలిగిపోయే స్టార్ భామ‌తో క‌లిసి ఆకాశంలో జ‌ర్నీ చేసే ఛాన్స్ వ‌స్తే..? అంత‌క‌న్నానా? అని సంబ‌ర‌ప‌డిపోయేవాళ్లు ఎంతోమంది. అంద‌నంత దూరాన ఉన్న ర‌కుల్ లాంటి స్టార్ హీరోయిన్ తో క‌లిసి హెలికాఫ్ట‌ర్లో జ‌ర్నీ చేసే అద్భుత అవ‌కాశం ద‌క్కితే ఎవ‌రు మాత్రం మిస్ చేసుకుంటారు చెప్పండి.

ఇప్పుడు అలాంటి ఛాన్స్ ఉంద‌ని ఊరిస్తోంది ర‌కుల్‌ప్రీత్‌. ఇంత‌కూ ర‌కుల్ తో క‌లిసి జ‌ర్నీ చేసే ఛాన్స్ ఎలా ద‌క్కుతుందంటారా?  చాలా సింఫుల్‌.. గూగుల్ ప్లే స్టోర్ కానీ.. ఐస్టోర్ లో కానీ ర‌కుల్ ప్రీత్ అఫీషియ‌ల్ యాప్ డౌన్ లోడ్ చేసుకుంటే చాలు.. అదృష్టం మీ త‌లుపు త‌ట్టే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. తాజాగా ర‌కుల్ ప్రీత్ సింగ్ త‌న‌కు చెందిన ఒక యాప్ ను రిలీజ్ చేసింది.

ఇందులో త‌న‌కు సంబంధించిన ఫోటోలు.. సినిమాలు.. క‌బుర్లు లాంటివి ఉంటాయి. ర‌కుల్ ప్రీత్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్న వారిలో ఇద్ద‌రిని ల‌క్కీ డీప్ ద్వారా ఎంపిక చేస్తారు. వారిని ర‌కుల్ తో పాటు ముంబ‌యి టూర్ కు హెలికాఫ్ట‌ర్ లో వెళ్లే అవ‌కాశం సొంతం చేసుకుంటారు. మ‌రిక ఆల‌స్యం ఎందుకు..?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు