కాజల్ కష్టం ఏమౌతుందో..

కాజల్ కష్టం ఏమౌతుందో..

ఈ రోజుల్లో కొంతమంది స్టార్ హీరోయిన్స్ ప్రమోషన్స్ కి రావడం చాలా అరుదు. స్టార్ట్ హీరోల సినిమాలకైనా సరే ఎదో అలా కనిపించి వెళ్లిపోతుంటారు. ఇక ఓ మీడియం హీరోలతో చేస్తే అసలు ఆ సినిమా రిలీజ్ అవుతుంది అనేది కూడా వారికి అనవసరం. కేవలం సోషల్ మీడియాలో ఎదో అలా అలా కామెంట్స్ పెట్టేసి చేతులు దులుపుకుంటారు. ఒళ్ళొంచి కష్టపడటానికి హీరోయిన్స్ కి బద్దకం ఎక్కువయ్యిందో లేదంటే వాళ్ళిచ్చే బడ్జెట్ కు అంత ప్రచారం చేయాల్సిన అవసరం లేదనుకుంటారో మరి.

మొన్నటి వరకు చిన్న సినిమాల ప్రమోషన్స్ కు కొంచెం దూరంగా కనిపించే కాజల్ మాత్రం MLA గారి కోసం మాత్రం స్పెషల్ గా ప్రమోషన్స్ లో పాల్గొంటోంది. కళ్యాణ్ రామ్ తో నటించిన MLA సినిమా ఈ శుక్రవారం రిలీజ్ కాబోతోంది. విడుదలకు సమయం ఎక్కువ లేకపోవడంతో ఇంటర్వ్యూలలో చాలా స్పీడ్ గా పాల్గొంటున్నారు. అమ్మడు రకరకాల డిజైనర్ దుస్తుల్లో చాలా హాటు హాటుగా కనిపిస్తూ.. సినిమాను భలేగా ప్రమోట్ చేస్తోంది. ఇక కళ్యాణ్ రామ్ కాజల్ మీడియాలలో చేస్తోన్న ప్రమోషన్స్ సినిమా కు బూస్ట్ ఇస్తుందని చెప్పాలి. కాజల్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ ప్రమోషన్స్ కి సమయాన్ని కేటాయిస్తోంది అంటే మెచ్చుకోదగ్గ విషయమే.

సినిమా ట్రైలర్ కి మంచి టాక్ అయితే వచ్చింది. సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉంటుందని ఓ వర్గం ప్రేక్షుకుల్లో అయితే నమ్మకాన్ని కలిగించారు. మరి ప్రమోషన్స్ కోసం ఇంతలా కష్టపడుతోన్న చిత్ర యూనిట్ కి సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందిస్తుందో చూడాలి. ముఖ్యంగా కాజల్ కష్టం ఎలా ఫలిస్తుందో చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు