నా బికినీ.. నా పర్సనల్..

నా బికినీ.. నా పర్సనల్..

ప్రత్యేకంగా పరిచయం లేని బ్యూటీలలో రాధికా ఆప్టే ఉందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలిసి మాట్లాడుతుందో తెలియక మాట్లాడుతుందో గాని అమ్మడు చేసి కొన్ని కామెంట్స్ చాలా ఘాటుగా ఉంటాయి. బీచ్ లో బికినీ వేసుకోకుండా చీర కట్టుకుని పడుకోమంటారా అనే వెరైటీ డైలాగ్ తో ఇటీవల మీడియా ముందు అరిచిన ఈ ముద్దుగుమ్మ ఒక్కోసారి నీతులు చెబితే ఆశ్చర్యపోవాల్సిందే. అసలు ఈమె రాధికా ఆప్టేనేనా అని అనకుండా ఉండలేము.

గత కొంత కాలంగా సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో రచ్చ చేస్తోన్న రాధిక రీసెంట్ గా మరోసారి వైరల్ అయ్యేలా ఒక ఫోటోని షేర్ చేసుకుంది. ఇన్స్టాగ్రామ్ లో అమ్మడు పోస్ట్ చేసిన ఒక ఫొటో ఇప్పుడు వైరల్ అయ్యింది. అయితే అందం మాట ఎత్తితేనే గరమయ్యే ఈ లేడి ఘాటైన బికినిలో బ్రాండ్ టిషర్ట్ ని తగిలించుకుని ఒక పొజిచ్చింది. టామీ హీల్ఫిగర్ అనే బ్రాండ్ టిషర్ట్ ప్రమోషన్స్ కోసం అమ్మడు ఆ విధంగా స్విమ్మింగ్ ఫుల్ దగ్గర హాట్ గా దర్శనమిచ్చి.. వాటర్స్ టెస్ట్ చేస్తున్నా అంటూ లొల్లాయ్ పాటలు పాడుతోంది.

ఇక ఈ విధమైన ఘాటైన స్టిల్స్ ఎందుకు ఇస్తోందని సోషల్ మీడియాలో ఎక్కువగా కామెంట్స్ రావడంతో అమ్మడు ఏ మాత్రం ఆలోచించకుండా నా పర్సనల్ అని అనేసింది. రాధికా కౌంటర్లు ఇవ్వడంలో చాలా తెలివిమంతురాలని అందరికి తెలిసిన విషయమే. అవసరం అయితే కుండబద్దలు కొట్టేట్లు మాట్లాడేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకు ఈ బికినీ వేషాలే సాక్ష్యం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు