భాగమతి డైరెక్టర్ కి బంపర్ఆఫర్

భాగమతి డైరెక్టర్ కి బంపర్ఆఫర్

ఓ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత.. ఆ దర్శకుడికి వరుస అవకాశాలు రావడంలో ఆశ్చర్యం లేదు. పిల్ల జమిందార్ తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అశోక్.. ఆ తర్వాత సక్సెస్ కోసం చాలా కాలమే ఎదురుచూశాడు. భాగమతి అంటూ అనుష్క శెట్టితో కలిసి జనాలను భయపెట్టి మాయచేసి మరీ మాంచి సక్సెస్ అందుకున్నాడు. అంతటి విజయం తర్వాత వరుస ఆఫర్స్ రావడంలో విచిత్రమేమీ లేదు.

అయితే.. అశోక్ మాత్రం ఇప్పుడు ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయబోతున్నాడు. కొమగట మరు 1914 అనే టైటిల్ పై ఓ హిస్టారికల్ బేస్డ్ సినిమాను తెరకెక్కించనున్నాడు. టైటిల్ కి తగినట్లుగానే 1914లో బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన ఓ చారిత్రక ఘటనకు వాస్తవ రూపం ఇవ్వబోతున్నాడు ఈ దర్శకుడు. బ్రిటిష్ పాలనలో ఉండగా జపనీస్ స్టీమ్ షిప్ కొమగట మరులో కొంతమంది భారతీయులు.. కెనడాలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. వారి ప్రవేశాన్ని అక్కడ అడ్డుకుంటారు.

ఓ ఇంటర్నేషనల్ మూవీని తెరకెక్కించనుండడం.. ఇలాంటి ఎమోషన్ ఉన్న స్టోరీని హ్యాండిల్ చేసే అవకాశం రావడం.. పైగా స్వతంత్రం వచ్చేందుకు ముందు భారతీయలు ఎదుర్కున్న ఇబ్బందులను ఆన్ స్క్రీన్ పై చూపించనుండడం.. ఎంతో సంతోషంగా ఉందని చెప్పాడు అశోక్. కెనడియన్ ఫిలిం కౌన్సిల్ భాగస్వామ్యంలో పెన్ ఎన్. కెమెరా ప్రొడక్షన్స్.. ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు