చలో దర్శకుడు హీరోను మార్చేస్తున్నాడా?

చలో దర్శకుడు హీరోను మార్చేస్తున్నాడా?

చలో మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టేశాడు వెంకీ కుడుముల. అటు హీరోగాను.. ఇటు నిర్మాతగాను నాగశౌర్యను మరచిపోలేని చిత్రాన్ని అందించాడు. అందుకే ఈ దర్శకుడితో సినిమా చేసేందుకు నిర్మాతలే కాదు.. యంగ్ హీరోస్ తెగ ఉత్సాహం చూపిస్తున్నారు.

ప్రస్తుతం చల్ మోహన రంగ మూవీని పూర్తి చేస్తున్న నితిన్ తో.. వెంకీ కుడుముల తర్వాతి చిత్రం ఉంటుందని అంతా భావించారు. ఈమేరకు టాక్స్ మాత్రమే కాదు.. హారిక అండ్ హాసిని బ్యానర్ పై నిర్మిస్తారనే మాటలు కూడా నడిచాయి. ఇప్పుడు తన తర్వాతి చిత్రానికి స్క్రిప్ట్ ఫైనల్ చేసేసుకున్నాడు వెంకీ కుడుముల. పూర్తి స్క్రిప్ట్ చేతిలోకి వచ్చాకే అసలు సమస్య మొదలైంది. ఈ స్క్రిప్ట్ కు నితిన్ కంటే మరో కుర్ర హీరో నిఖిల్ అయితే కరెక్ట్ సరిపోతాడని భావించాడట ఈ దర్శకుడు. అదే విషయాన్ని నిర్మాతలకు చెప్పడం.. తమ బ్యానర్ కు సిస్టర్ కంపెనీ అయిన సితార ఎంటర్టెయిన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించాలని ఫిక్స్ అయిపోవడం జరిగిపోయాయట.

కానీ ఇక్కడ సమస్య ఏంటంటే.. నిఖిల్ ఇంకా ఈ ప్రాజెక్టుకు ఓకే చెప్పలేదు. స్టోరీ వెర్షన్ నిఖిల్ వరకూ వెళ్లిందో లేదో తెలీదు కానీ.. బౌండ్ స్క్రిప్ట్ రెడీగా ఉంది. అయితే.. వెంకీ కుడుముల ట్యాలెంట్.. ప్లస్ బడా నిర్మాణ సంస్థతో సినిమా చేయడం.. ఈ రెండు పాయింట్స్ ను పరిశీలిస్తే.. నిఖిల్ ఈ ప్రాజెక్టుకు నో చెప్పే అవకాశాలు తక్కువే అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English