‘గాయత్రి’ని ఫ్రీగా చూపించేస్తున్నారు

‘గాయత్రి’ని ఫ్రీగా చూపించేస్తున్నారు

మంచు మోహన్ బాబుకు మళ్లీ హుషారు తెప్పించే సినిమా అవుతుందని ఆశించారు ‘గాయత్రి’ని. కానీ ఆ సినిమా మంచు కుటుంబాన్ని తీవ్ర నిరాశకు గురి చేసింది. చాలా ఏళ్ల తర్వాత మోహన్ బాబు పూర్తి స్థాయి హీరో పాత్రలో రాణించే ప్రయత్నం చేశారు. ఒకటికి రెండు భిన్నమైన పాత్రల్ని ఇందులో చేశారు. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. కానీ ప్రయత్నమంతా వృథా అయింది.

ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘గాయత్రి’కి ఓపెనింగ్స్ దారుణంగా వచ్చాయి. వీకెండ్ అయ్యాక సినిమా అడ్రస్ లేకుండా పోయింది. కనీసం దీని గురించి జనాల్లో చర్చ కూడా లేకపోయింది.

‘గాయత్రి’ శాటిలైట్.. డిజిటల్ హక్కులు కూడా అమ్ముడు పోయినట్లుగా లేదు. ఎందుకంటే ఇంతలోనే ఈ చిత్రాన్ని యూట్యూబ్‌లో ఫ్రీగా చూపించేస్తున్నారు. ఈ మధ్య ఎంతటి ఫ్లాప్ సినిమాకైనా శాటిలైట్.. డిజిటల్ హక్కుల ద్వారా ఎంతో కొంత మొత్తం నిర్మాతలకు అందుతోంది. ముందు టీవీల్లో బొమ్మ పడాలి. లేదంటే అమేజాన్, నెట్‌ఫ్లిక్స్ లాంటి డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్‌లో సినిమాను చూపించాలి.

కానీ అదేమీ లేకుండా విడుదలైన 40 రోజుల్లోపే యూట్యూబ్‌లో ఫ్రీగా సినిమా చూపిస్తుండటం ఆశ్చర్యం కలిగించే విషయమే. దీన్ని బట్టే ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో.. జనాల్లో ఏమాత్రం ఆసక్తి నెలకొందన్నది అర్థమవుతుంది. ఈ చేదు అనుభవం నేపథ్యంలో మోహన్ బాబు ఇప్పుడిప్పుడే మళ్లీ లీడ్ రోల్స్ చేయరేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు