నరేష్-సునీల్.. సిల్లీ ఫెలోస్

నరేష్-సునీల్.. సిల్లీ ఫెలోస్

అల్లరి నరేష్ సినిమాలకు భలే ఫన్నీ టైటిళ్లు పెడుతుంటారు డైరెక్టర్లు. ఐతే మధ్యలో అతడి సినిమాల్లో కామెడీ తగ్గిపోయింది. టైటిళ్లు కూడా అంత ఆకర్షణీయమైనవి పడలేదు. ఐతే ఇప్పుడు నరేష్.. మళ్లీ ఓ ఆకర్షణీయమైన టైటిల్‌తో రాబోతున్నాడు. ‘సుడిగాడు’తో తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన భీమనేని శ్రీనివాసరావుతో అల్లరి నరేష్ జత కట్టిన సంగతి తెలిసిందే.

ఈ చిత్రానికి ‘సిల్లీ ఫెలోస్’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. నరేష్ హీరోగా తెరకెక్కుతుంటే ‘సిల్లీ ఫెలో’ అని పెట్టాలి కానీ.. ‘సిల్లీ ఫెలోస్’ ఏంటి అనిపిస్తోంది కదా? ఈ సినిమాలో మరో హీరోగా కూడా ఉన్నాడు. అతనే.. సునీల్. అందుకే టైటిల్ ‘సిల్లీ ఫెలోస్’ అయింది.

భీమనేని-నరేష్ కలిసి ‘సుడిగాడు’కు సీక్వెల్ చేస్తున్నట్లుగా ప్రచారం జరిగింది కానీ.. అలాంటిదేమీ లేదని.. ఇది కొత్త కథతో తెరకెక్కుతున్న సినిమా అని సమాచారం. ముందు ‘సుడిగాడు’ సీక్వెల్ అనుకున్నప్పటికీ ఆ తర్వాత ఆలోచన మారిందట. నరేష్-సునీల్ కాంబినేషన్లో ఒక కొత్త కథతోనే ఈ సినిమా చేస్తున్నారట. ఈ ఇద్దరు హీరోలతో పాటు దర్శకుడు భీమనేనికి కూడా ఇప్పుడు హిట్ చాలా అవసరం.

ఒకప్పుడు మంచి ఊపులో ఉన్న నరేష్, సునీల్ గత కొన్నేళ్లలో వరుస పరాజయాలతో సతమతమయ్యారు. భీమనేని చివరగా చేసిన ‘స్పీడున్నోడు’ కూడా తీవ్ర నిరాశకు గురి చేసింది. మరి ఈ ముగ్గురికీ ‘సిల్లీ ఫెలోస్’ ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English