రానాకు ప్లస్సా.. మైనస్సా?

రానాకు ప్లస్సా.. మైనస్సా?

కొన్ని క్యారెక్టర్లు వేరే భాషల్లో చేస్తే ఓకెగాని, తెలుగులో అవి చేస్తుంటే మనకు ఓ సందేహం వస్తుంది. పైగా దర్శకనిర్మాతలు అలాంటి క్యారెక్టర్లలో చూసిన హీరోలను తిరిగి మెయిన్‌ లీడ్‌ పాత్రలో చూడ్డానికి ఎంతవరకు హెల్ప్‌ చేస్తారనేది కూడా సందేహమే. ఇప్పుడు రానా దగ్గుబాటి గురించి ఫిలింనగర్‌లో ఇలాంటి టాక్‌ నడుస్తోంది. ప్రస్తుతం మనోడు బాహుబలి సినిమాలో ఒక సపోర్టింగ్‌  రోల్‌ చెయ్యడమే కాదు, మరో తమిళ డబ్బింగ్‌ సినిమాతో కూడా వస్తున్నాడు.

సాధారణంగా తెలుగు హీరోలు ఎన్నిసార్లు గెస్ట్‌ రోల్స్‌ చేసినా, వెండితెరపై చనిపోవడమంటే పెద్దగా ఒప్పుకోరు. కాని రానా మాత్రం తమిళనాట హిట్టయిన ‘ఆరంభం’ అనే సినిమాలో, హీరో అజిత్‌ సరసన చేసిన యాంటి టెర్రరిస్ట్‌ స్వాడ్‌ ఆఫీసర్‌ పాత్రలో చనిపోతాడు. రంగ్‌ దే బసంతి సినిమాలో మాధవన్‌ చేసిన చిన్న పాత్ర టైపులో, ఇక్కడ రానా చేసిన పాత్ర కూడా ఉంటుంది. ఈయన చావు గురించి రెవెంజ్‌ తీర్చుకోవడమే యావత్‌ సినిమా అంతా. పాత్ర వైవిధ్యభరితమే అయినా, తెలుగులో ఇలాంటివి చెయ్యడం ప్లస్సేనా అనేది ప్రశ్న.

ఈ సినిమాను ఇప్పుడు తెలుగులో ‘ఆట ఆరంభం’ అనే పేరుతో డబ్బింగ్‌ చేసి విడుదల చేస్తున్నారులేండి. ఒకవేళ తెలుగులో సినిమా హిట్టయినా, రానాకు అలాంటి ఆఫర్లు వరుసగా వస్తే, వాటిని కాస్త ప్రక్కనపెట్టడమే మంచిదంటున్నారు. ఎందుకంటే అవి చేస్తూపోతే ఇక హీరోగా ఎప్పుడు నిలదొక్కుకుంటాడు...

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు