‘రంగస్థలం’లో ఎవరేంటి?

‘రంగస్థలం’లో ఎవరేంటి?

ఇంకో పది రోజులే మిగిలుంది ‘రంగస్థలం’ రాకకు. ఈ సినిమాపై క్యూరియాసిటీ అంతకంతకూ పెరిగిపోతోంది. ఇప్పటికే సినిమాపై అంచనాలు భారీగా ఉండగా.. నిన్నటి థియేట్రికల్ ట్రైలర్ చూశాక అవి మరింత పెరిగిపోయాయి. ఈ ట్రైలర్‌తో పాటు చిత్ర బృందం సినిమాలోని పాత్రల్ని కూడా వైవిధ్యమైన రీతిలో పరిచయం చేసింది. నటీనటుల పేర్లతో పాటు వాళ్ల లుక్స్ కూడా బయటపెట్టారు.

‘రంగస్థలం’లో రామ్ చరణ్ చిట్టిబాబు పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. సమంతగా రామలక్ష్మి కూడా ఇది వరకే పరిచయమైంది. ఇక ఇందులో చరణ్ తండ్రి పాత్రలో నరేష్ కోటేశ్వరరావుగా దర్శనమిస్తాడు. ఆయన ఒక పేద తండ్రిగా కనిపించబోతున్నాడు. చాన్నాళ్లుగా ప్రచారంలో ఉన్నట్లే అనసూయ ఇందులో రామ్ చరణ్ అత్తగా ‘రంగమ్మత్త’ పాత్రలో కనువిందు చేయబోతోంది. ప్రకాష్ రాజ్ ఆదర్శ భావాలున్న పెద్ద మనిషిగా దక్షిణామూర్తి అనే పాత్రలో కనిపించబోతున్నాడు.

ఇక జగపతిబాబు ప్రెసిడెంటుగా విలన్ పాత్రలో దర్శనమిస్తాడు. ఆయన పాత్ర చాలా టిపికల్‌గా ఉండబోతోందన్న సంకేతాలు అందుతున్నాయి. దశాబ్దాలుగా ఊరిని తన గుప్పెట్లో పెట్టుకుని ప్రెసిడెంటుగా కొనసాగే పాత్రలో జగపతిబాబు కనిపిస్తాడు. ఆది మంచి చదువు చదువుకొచ్చి ఆ ప్రెసిడెంటును ఎన్నికల్లో ఢీకొట్టే కుమార్ బాబుగా కనిపించనున్నాడు. ఇవీ సినిమాలోని ముఖ్యమైన పాత్రలు. ఇంకా సినిమాలో సత్య.. గెటప్ శీను.. శత్రు లాంటి వాళ్లు మిగతా పాత్రల్లో కనిపిస్తారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు