చిరు నోరు జారేశాడే..

చిరు నోరు జారేశాడే..

చాలా జాగ్రత్తగా మాట్లాడే మెగాస్టార్ చిరంజీవి.. ఉద్వేగంలో టంగ్ స్లిప్ అయిపోయాడు. ఒక కీలకమైన రహస్యాన్ని బయటపెట్టేశాడు. ఆయన రివీల్ చేసిన విషయం ‘రంగస్థలం’ దర్శకుడు సుకుమార్‌తో పాటు ఆ చిత్ర బృందానికి ఇబ్బందికర పరిస్థితి తెచ్చిపెట్టింది. కొంచెం ఆలస్యంగా తన తప్పును గుర్తించి సర్దుకునే ప్రయత్నం చేసినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ‘రంగస్థలం’ ప్రి రిలీజ్ ఈవెంట్లో చోటు చేసుకున్న పరిణామమిది.

‘రంగస్థలం’ సినిమాకు తొలి ప్రేక్షకుడు చిరంజీవే. ఆయన కొన్ని రోజుల కిందటే ఆ సినిమా చూసేశారు. ఆయనకు విపరీతంగా నచ్చేసింది. ఆల్రెడీ సుకుమార్‌ను ఇంటికి పిలిపించుకుని మరీ పొగిడాడు. నిన్న ప్రి రిలీజ్ ఈవెంట్లోనూ సుక్కును ఆకాశానికెత్తేశాడు. సినిమా గురించి కూడా చాలా గొప్పగా మాట్లాడాడు. చరణ్ పెర్ఫామెన్స్ అమోఘమని పొగిడేస్తూ.. ఒక చోట ఆది ‘డెత్’ సీన్లో అన్నాడు చిరు. ఒకసారి నోరు జారితే ఓకే.. మళ్లీ రెండోసారి కూడా ‘డెత్’ అనే మాటను వాడాడు.

దీంతో ఆది పాత్ర ఈ సినిమాలో చనిపోతుందనే విషయం అందరికీ అర్థమైంది. రెండోసారి ‘డెత్’ అన్న మాట వాడినపుడు చిరు సర్దుకుని.. ముగింపు సీన్లో అంటూ కవర్ చేసే ప్రయత్నం చేశాడు కానీ.. విషయం ఆల్రెడీ జనాల్లోకి వెళ్లిపోయింది. సోషల్ మీడియాలో దీని గురించి డిస్కషన్లు మొదలైపోయాయి. సినిమా చివర్లో ఆది పాత్ర చనిపోతుందని.. ఆ సన్నివేశాలు హృదయాల్ని మెలిపెట్టేలా ఉంటాయని.. ఆ టైంలో రామ్ చరణ్ పెర్ఫామెన్స్ అదిరిపోతుందని జనాలు చర్చించుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు